సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 372 పాయింట్లు పడి 76,728 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 110 పాయింట్లు కోల్పోయి 23,946 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 450 పాయింట్లు పడి 57,272 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,350.10 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,801.45 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 40 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 24,250 లెల్స్ దాటికే బయ్యర్లకు మరింత కన్విక్షన్ ఏర్పడుతుంది. అక్కడి నుంచి సూచీ 24,400- 24,600 లెవల్స్ వరకు వెళ్లొచ్చు. 200 డీఎంఏ ఉన్న 23,850 జోన్ మాత్రం నిఫ్టీ50కి కీలక సపోర్ట్‌గా మారింది,” అని ప్రభుదాస్ లిల్లధేర్కి చెందిన వైస్ ప్రెసిడెంట్, టెక్నికల్ రీసెర్చ్ వైశాలి పరేఖ్ తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.59 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 1.18శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 2.07 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధరలు..
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధరలు..
{{/usCountry}}ముడి చమురు ధరలు పడ్డాయి. మంగళవారం ట్రేడింగ్ సెషన్లో బ్రెంట్ క్రూడ్ 1.03శాతం పడి బ్యారెల్‌కి 72.40 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
ఎంసీఎక్స్- బై రూ. 2930, స్టాప్ లాస్ రూ. 2880, టార్గెట్ రూ. 3020
ఐఈఎక్స్- బై రూ. 125, స్టాప్ లాస్ రూ. 122, టార్గెట రూ. 130
జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ- బై రూ. 583, స్టాప్ లాస్ రూ. 573, టార్గెట్ రూ. 600
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
ఇండియా గ్లైకోల్స్- బై రూ. 980, స్టాప్ లాస్ రూ. 935, టార్గెట్ రూ. 1070
భారత్ ఫోర్జ్- బై రూ. 2170, స్టాప్ లాస్ రూ. 2080, టార్గెట్ రూ. 2370
చెన్నై పెట్రోలియం కార్పొరేషన్- బై రూ. 11545, స్టాప్ లాస్ రూ. 1100, టార్గెట్ రూ. 1290
గేబ్రియల్ ఇండియా- బై రూ. 1275, స్టాప్ లాస్ రూ. 1205, టార్గెట్ రూ. 1425
ఏఐఏ ఇంజినీరింగ్- బై రూ. 4950, స్టాప్ లాస్ రూ. 4750, టార్గెట్ రూ. 5350