శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 2073 పాయింట్లు పెరిగి 83,739 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 639 పాయింట్లు వృద్ధిచెంది 25,728 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 1422 పాయింట్లు పెరిగి 60,041 వద్దకు చేరింది.

ఇండియా- యూఎస్ ట్రేడ్ డీల్ కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం సూచీల్లో ఇంతటి ర్యాలీకి అసలు కారణం. ఈ ట్రేడ్ డీల్‌కి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు ఏకంగా రూ. 5,236.28 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,014.24 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ ఫిబ్రవరి నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 2,815.48 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,777.84 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
మంగళవారం నాటి అతి భారీ లాభాల అనంతరం, బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 10 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.34 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.84శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.43 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
బంగారం, వెండి ధరలు ఇలా..
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
బంగారం, వెండి ధరలు ఇలా..
{{/usCountry}}అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 2శాతం పెరిగి ఔన్సుకు 5వేల డాలర్ల మార్క్‌ను మరోసారి తాకింది. ఇక స్పాట్ సిల్వర్ 4శాతం వృద్ధి చెంది 86.9 డాలర్ల (ఔన్సుకు) వద్ద ట్రేడ్ అవుతోంది.
స్టాక్స్ టు బై..
అశోక్ లేల్యాండ్- బై రూ. 200, స్టాప్ లాస్ రూ. 193, టార్గెట్ రూ. 214
ఎస్బీఐ- బై రూ. 1064, స్టాప్ లాస్ రూ. 1025, టార్గెట్ రూ. 1142
పేటీఎం- బై రూ. 1190, స్టాప్ లాస్ రూ. 1145, టార్గెట్ రూ. 1220
హిందుస్థాన్ పెట్రోలియం- బై రూ. 450, స్టాప్ లాస్ రూ. 400, టార్గెట్ రూ. 470
యూపీఎల్- బై రూ. 740, స్టాప్ లాస్ రూ. 720, టర్గెట్ రూ. 780
మారుతీ సుజుకీ- బై రూ. 14782, స్టాప్ లాస్ రూ. 14500, టార్గెట్ రూ. 15400,
జైడస్ లైఫ్- బై రూ. 902, స్టాప్ లాస్ రూ. 880, టార్గెట్ రూ. 945
కాన్కర్- బై రూ. 528, స్టాప్ లాస్ రూ. 516, టార్గెట్ రూ. 565