...
...
Next Story

వెనెజువెలాపై అమెరికా దాడి- ఈ రోజు స్టాక్​ మార్కెట్​ పరిస్థితేంటి? చమురు ధర పెరిగిందా?

జనవరి 5, ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jan 5, 2026, 08:15:36 IST
Advertisement

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 573 పాయింట్లు పెరిగి 85,762 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 182 పాయింట్లు వృద్ధిచెంది 26,329 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 439 పాయింట్లు పెరిగి 60,151 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..
స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..

శనివారం తెల్లవారుజామున వెనెజువెలాపై అమెరికా మెరుపు దాడి చేసి, ఆ దేశాధ్యక్షుడు నికొలస్​ మదురోను అరెస్ట్​ చేసింది. దీని ప్రభావం ప్రపంచ స్టాక్​ మార్కెట్​లపై ప్రతికూలంగా ఉంటుందని అందరు భావించారు. కానీ ఆసియా స్టాక్​ మార్కెట్​లు, గిఫ్ట్​ నిఫ్టీపై వెనెజువెలా అనిశ్చితి ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిజర్వ్​ ఉన్న వెనెజువెలాలో సంక్షోభం కారణంగా.. ముడిచమురు ధర మాత్రం స్వల్పంగా పెరిగింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 544.36 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 534.24 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 80 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50 తన కీలక రెసిస్టెన్స్​ 26,200 ని దాటింది. ప్రస్తుతం సూచీకి 226,450- 26,500 లెవల్స్​ వద్ద రెసిస్టెన్స్​ ఉంది. 26,150- 26,200 వద్ద సపోర్ట్​ ఉంది,” అని ఛాయిస్​ బ్రోకింగ్​కి చెందిన ఎగ్జిక్యూటివ్​ డైరక్టర్​ సుమిత్​ బగాడియా తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.

చమురు ధరలు..

వెనెజువెలాపై అమెరికా దాడులు నేపథ్యంలో ముడిచమురు ధరలు స్వల్పంగా పెరిగాయి. బ్రెంట్​ క్ రూడ్​ 17 సెంట్లు పెరిగి బ్యారెల్​కి 60.92 డాలర్లకు చేరింది.

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

జేబీఎం ఆటో- బై రూ. 666.6, స్టాప్​ లాస్​ రూ. 634, టార్గెట్​ రూ. 720

అనంత్​ రాజ్​- బై రూ. 584.05, స్టాప్​ లాస్​ రూ. 554, టార్గెట్​ రూ. 640

సీఈఎస్​సీ- బై రూ. 175.3, స్టాప్​ లాస్​ రూ. 167, టార్గెట్​ రూ. 192

ఎలెకాన్​ ఇంజినీరింగ్​ కంపెనీ- బై రూ. 501, స్టాప్​ లాస్​ రూ. 478, టార్గెట్​ రూ. 550

యూనో మిండా- బై రూ. 1321.2, స్టాప్​ లాస్​ రూ. 1260, టార్గెట్​ రూ. 1450

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe