గురువారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 504 పాయింట్లు పడి 83,314 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 133 పాయింట్లు కోల్పోయి 25,643 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 175 పాయింట్లు పడి 60,064 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2,150.51 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,129.82 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ ఫిబ్రవరి నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 694.76 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,157.2 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 140 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 25,600 దిగువకు పడితే మరింత సెల్లాఫ్ కనిపించే అవకాశం ఉంది. అదే జరిగితే సూచీ 25,500 వరకు వెళ్లొచ్చు. ఇక 25,800 వద్ద బలమైన రెసిస్టెన్స్ ఉంది. అది బ్రేక్ అయితే సూచీ 25,900- 25,925 వరకు వెళుతుంది,” అని కొటాక్ సెక్యూరిటీస్ హెడ్ ఈక్విటీ రీసెర్చ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 1.2 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 1.23శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.59 శాతం డౌన్ అయ్యింది.
{{/usCountry}}శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 1.2 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 1.23శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.59 శాతం డౌన్ అయ్యింది.
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
జీఈఎస్హెచ్ఐపీ- బై రూ. 1268, స్టాప్ లాస్ రూ. 1224, టార్గెట్ రూ. 1352
ఐఓసీ- బై రూ. 176, స్టాప్ లాస్ రూ. 170, టార్గెట్ రూ. 188
పీఎన్బీ- బై రూ. 124, స్టాప్ లాస్ రూ. 118, టార్గెట్ రూ. 132
పాలీ మెడిక్యూర్- బై రూ. 1500, స్టాప్ లాస్ రూ. 1470, టార్గెట్ రూ. 1575
యూపీఎల్- బై రూ. 750, స్టాప్ లాస్ రూ. 730, టార్గెట్ రూ. 780