శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 266 పాయింట్లు పెరిగి 83,580 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 51 పాయింట్లు వృద్ధిచెంది 25,694 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 57 పాయింట్లు పెరిగి 60,121 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,950.77 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,265.06 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ ఫిబ్రవరి నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 2,645.53 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,892.14 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 215 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం. అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు ఉండటం ఈ గ్యాప్ ఆప్‌కి కారణం.
“ఇంట్రాడేలో మార్కెట్ వీక్‌గా కనిపిస్తోంది. 25,600 దిగువకు నిఫ్టీ50 పడితే మరింత సెల్లాఫ్ కనిపించవచ్చు. అక్కడి నుంచి 25,500కి కూడా వెళ్లొచ్చు. కాగా, 25,800 వద్ద రెసిస్టెన్స్ ఉంది. అది దాటితే సూచీ 25,900- 25,925కి కూడా వెళుతుంది,” అని కొటాక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 2.4 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 1.97శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 2.18 శాతం పెరిగింది.
{{/usCountry}}మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 2.4 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 1.97శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 2.18 శాతం పెరిగింది.
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. జపాన్ సూచీలి రికార్డు గరిష్ఠాలకు చేరాయి.
స్టాక్స్ టు బై..
టొరంట్ ఫార్మా- బై రూ. 1429, స్టాప్ లాస్ రూ. 1377, టార్గెట్ రూ. 1530
జిందాల్ స్టీల్- బై రూ. 1189.90, స్టాప్ లాస్ రూ. 1147, టార్గెట్ రూ. 1275
ఐటీసీ- బై రూ. 326, స్టాప్ లాస్ రూ. 314, టార్గెట్ రూ. 342
ఎయిర్టెల్- బై రూ. 2038, స్టాప్ లాస్ రూ. 2010, టార్గెట్ రూ. 2100
కొటాక్ మహీంద్రా బ్యాంక్- బై రూ. 422, స్టాప్ లాస్ రూ. 410, టార్గెట్ రూ. 460
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
ఐడీబీఐ బ్యాంక్- బై రూ. 106.89, స్టాప్ లాస్ రూ. 102.5, టార్గెట్ రూ. 115
శార్దా క్రాప్కెమ్- బై రూ. 1192, స్టాప్ లాస్ రూ. 1147, టార్గెట్ రూ. 1285
నవీన్ ఫ్లోరిన్- బై రూ. 6417, స్టాప్ లాస్ రూ. 6200, టార్గెట్ రూ. 6850
ఎస్కార్ట్స్- బై రూ. 3763, స్టాప్ లాస్ రూ. 3630, టార్గెట్ రూ. 4000
కర్రారో ఇండియా- బై రూ. 547, స్టాప్ లాస్ రూ. 530, టార్గెట్ రూ. 590