Sensex today : బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 118 పాయింట్లు పెరిగి 75,318 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 41 పాయింట్లు వృద్ధిచెంది 23,659 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 153 పాయింట్లు పెరిగి 53,562 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,597 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,968 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 145 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 డైలీ చార్ట్‌లో పెద్ద బుల్ క్యాండిల్ ఏర్పడింది. కింది స్థాయి నుంచి బయ్యింగ్కి ఇది సంకేతం. గత కొన్ని సెషన్లుగా సూచీ 23,800- 23,200 లెవల్స్ మధ్య కదులుతోంది. హయ్యర్ లో ప్యాటర్న్ ఫార్మ్ చేస్తోంది. ట్రెండ్ రెంజ్ బౌండ్‌గా ఉంది. 23,800 బ్రేక్ అయితే, అప్‌ట్రెండ్ ప్రారంభమవ్వొచ్చు,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 1.31 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 1.08శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.55 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధరలు..
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధరలు..
{{/usCountry}}అంతర్జాతీయ అనిశ్చితి మధ్య ముడి చమురు ధరలు ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ 0.45శాతం పెరిగి బ్యారెల్‌కి 105.49 డాలర్లకు చేరింది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
మాన్‌కైండ్ ఫార్మా- బై రూ. 2584, స్టాప్ లాస్ రూ. 2465, టార్గెట్ రూ. 2800
చెన్నై పెట్రోలియం కార్పొరేషన్- బై రూ. 1012, స్టాప్ లాస్ రూ. 970, టార్గెట్ రూ. 1090
జెన్ టెక్నాలజీస్- బై రూ. 1604, స్టాప్ లాస్ రూ. 1535, టార్గెట్ రూ. 1740
క్రిసిల్- బ రూ. 4214, స్టాప్ లాస్ రూ. 4025, టార్గెట్ రూ. 4550
బీహెచ్ఈఎల్- బై రూ. 408, స్టాప్ లాస్ రూ. 390, టార్గెట్ రూ. 445