సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 54 పాయింట్లు పడి 85,213 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 20 పాయింట్లు కోల్పోయి 26,027 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 72 పాయింట్లు పెరిగి 59,462 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,468.32 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,792.25 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 21,073.83 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 41,762.45 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 5 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 ప్రస్తుతం 25,900- 26,100 లెవల్స్ వద్ద రేంజ్ బౌండ్లో కొనసాగుతోంది. ఈ రెండింటిలో ఏది బ్రేక్ అయినా, డైరక్షన్ మార్పు కనిపించవచ్చు,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ రూపక్ దే తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.09 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.2శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.5 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
{{/usCountry}}హిందుస్థాన్ జింక్- బై రూ. 567, స్టాప్ లాస్ రూ. 547, టార్గెట్ రూ. 607
ఫెడరల్ బ్యాంక్- బై రూ. 265, స్టాప్ లాస్ రూ. 255, టార్గెట్ రూ. 285
హెచ్ఏఎల్- బై రూ. 4320, స్టాప్ లాస్ రూ. 4200, టార్గెట్ రూ. 4500
ఎయిర్టెల్- బై రూ. 2070, స్టాప్ లాస్ రూ. 2040, టార్గెట్ రూ. 2125
మారికో- బై రూ. 737, స్టాప్ లాస్ రూ. 725, టార్గెట్ రూ. 750
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
వీల్స్ ఇండియా: రూ .890 వద్ద కొనండి, టార్గెట్ రూ .960, స్టాప్ లాస్ రూ .860;
లుమాక్స్ ఇండస్ట్రీస్: రూ .5631 వద్ద కొనండి, లక్ష్యం రూ .6050, స్టాప్ లాస్ రూ .5450;
ఇండియన్ మెటల్స్ మరియు ఫెర్రో అల్లాయ్స్: రూ .1449 వద్ద కొనండి, రూ .1555 టార్గెట్, స్టాప్ లాస్ రూ .1400;
ఎస్‌జేఎస్ ఎంటర్ ప్రైజెస్: రూ .1726 వద్ద కొనండి, లక్ష్యం రూ .1850, స్టాప్ లాస్ రూ .1666;
ఎల్జీ బాలకృష్ణన్ అండ్ బ్రదర్స్: రూ .1949 వద్ద కొనండి, లక్ష్యం రూ .2100, స్టాప్ లాస్ రూ .1880.