అమెరికా- ఇరాన్ మధ్య కాల్పుల విరమణ నేపథ్యంలో బుధవారం భారీగా లాభపడిన దేశీయ స్టాక్ మార్కెట్లు, అదే కాల్పుల విరమణపై అనిశ్చితి కారణంగా గురువారం భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 931 పాయింట్లు పడి 76,632 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 222 పాయింట్లు పతనమై 23,775 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 882 పాయింట్లు కోల్పోయి 54,822 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,711.19 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 955.90 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 80 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“టెక్నికల్ పరంగా నిఫ్టీ50కి 23,920- 24,000 లెవల్స్ కీలక రెసిస్టెన్స్‌గా ఉన్నాయి. 23,500- 23,580 జోన్ కీలక సపోర్ట్‌గా ఉంది. అదే సమయంలో ఇండియా విక్స్ 3.71శాతం పడింది. ఇది స్థిరత్వానికి సంకేతం,” అని చాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సుమీత్ బగాడియా తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.58 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.62శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.8 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అమెరికా- ఇరాన్ మధ్య అనిశ్చితి నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ధర శుక్రవారం 0.8శాతం పెరిగి బ్యారెల్‌కి 96.75 డాలర్లకు చేరింది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
{{/usCountry}}అమెరికా- ఇరాన్ మధ్య అనిశ్చితి నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ధర శుక్రవారం 0.8శాతం పెరిగి బ్యారెల్‌కి 96.75 డాలర్లకు చేరింది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
{{/usCountry}}జీఈ వెర్నోవా టీ అండ్ డీ ఇండియా- బై రూ. 3911, స్టాప్ లాస్ రూ. 3750, టార్గెట్ రూ. 4200
ఐఎస్జీఈసీ హెవీ ఇంజినీరింగ్- బై రూ. 953, స్టాప్ లాస్ రూ. 914, టార్గెట్ రూ. 1020
వారీ ఎనర్జీస్- బై రూ. 3232, స్టాప్ లాస్ రూ. 3088, టార్గెట్ రూ. 3450
సెనోరెస్ ఫార్మా- బై రూ. 805, స్టాప్ లాస్ రూ. 3088, టార్గెట్ రూ. 3450
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్- బై రూ. 428, స్టాప్ లాస్ రూ. 410, టార్గెట్ రూ. 460