సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 737 పాయింట్లు పెరిగి 76,264 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 231 పాయింట్లు వృద్ధిచెంది 23,854 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 384 పాయింట్లు పెరిగి 57,199 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 200 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,189.26 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 5 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“బలమైన గ్యాప్ అప్ ఓపెనింగ్ తర్వాత నిఫ్టీ50.. డైలీ ఛార్ట్‌లో చిన్న రెడ్ క్యాండిల్ని ఫార్మ్ చేసింది. ఈ గ్యాప్‌ని బుల్లిష్ బ్రేకవే గ్యాప్ అంటారు. దీని సానుకూల విషయమే. నిఫ్టీ50కి 24,100 వద్ద కీలక రెసిస్టెన్స్ ఉంది. అది దాటితే సూచీ 24,500 వరకు కూడా వెళ్లొచ్చు. 23,650 వద్ద కీలక సపోర్ట్ ఉంది,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.92 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 1.62శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 3.07 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
{{/usCountry}}మంగళవారం ట్రేడింగ్ సెషన్లో బ్రెంట్ క్రూడా 0.3శాతం పెరిగి బ్యారెల్‌కి 83.42 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
హీరో మోటోకార్ప్- బై రూ. 5000, స్టాప్ లాస్ రూ. 4900, టార్గెట్ రూ. 5200
పైన్ ల్యాబ్స్- బై రూ. 152, స్టాప్ లాస్ రూ. 148, టార్గెట్ రూ. 160
ఎం అండ్ ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్- బై రూ. 295, స్టాప్ లాస్ రూ. 285, టార్గెట్ రూ. 310
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
నిప్పాన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్- బై రూ. 1140, స్టాప్ లాస్ రూ. 1082, టార్గెట్ రూ. 1235
ఎలెకాన్ ఇంజినీరింగ్- బై రూ. 560, స్టాప్ లాస్ రూ. 528, టార్గెట్ రూ. 605
హిందుస్థాన్ ఫుడ్స్- బై రూ. 557, స్టాప్ లాస్ రూ. 520, టార్గెట్ రూ. 600
మనాలీ పెట్రోకెమికల్స్- బై రూ. 68.2, స్టాప్ లాస్ రూ. 64.2, టార్గెట్ రూ. 74
బెల్‌రైస్ ఇండస్ట్రీస్- బై రూ. 238.2, స్టాప్ లాస్ రూ. 228, టార్గెట్ రూ. 260