సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 281 పాయింట్లు పడి 77,728 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 78 పాయింట్లు కోల్పోయి 24,288 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 7 పాయింట్లు పెరిగి 57,498 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2,535.10 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,101.46 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 75 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. డౌ జోన్స్ 0.50 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.52శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.32 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా ముడి చమురు ధర మరింత పెరిగింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 90 డాలర్లు దాటేసింది. ప్రస్తుతం 91.14 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
స్టాక్స్ టు బై..
కాన్కార్డ్ బయోటెక్- బై రూ. 1515, స్టాప్ లాస్ రూ. 1437, టార్గెట్ రూ. 1650
కెఫిన్ టెక్నాలజీస్- బై రూ. 973, స్టాప్ లాస్ రూ. 925, టార్గెట్ రూ. 1075
{{/usCountry}}కెఫిన్ టెక్నాలజీస్- బై రూ. 973, స్టాప్ లాస్ రూ. 925, టార్గెట్ రూ. 1075
{{/usCountry}}కేఈఐ ఇండస్ట్రీస్- బై రూ. 5873, స్టాప్ లాస్ రూ. 5680, టార్గెట్ రూ. 6250
ఒబెరాయ్ రియాల్టీ- బై రూ. 1931, స్టాప్ లాస్ రూ. 1832, టార్గెట్ రూ. 2125
ఫినొలెక్స్ కేబుల్స్- బై రూ. 1321, స్టాప్ లాస్ రూ. 1252, టార్గెట్ రూ. 1460