మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 568 పాయింట్లు పెరిగి 76,071 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 172 పాయింట్లు వృద్ధిచెంది 23,581 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 463 పాయింట్లు పెరిగి 54,876 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 4,741.22 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,225.32 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 25 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 23,350- 23,300 కీలక సపోర్ట్ జోన్‌గా ఉంది. పుల్ బ్యాక్ అయితే సూచీ 23,800కి, అక్కడి నుంచి 23,950 వరకు వెళ్లొచ్చు,” అని కొటాక్ సెక్యూరిటీస్ వెల్లడించింది.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.10 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.25శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.4 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధరలు..
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర స్వల్పంగా తగ్గింది. బ్రెంట్ క్రూడ్ 1.1శాతం పడి బ్యారెల్‌కి 102.27కి చేరింది.
స్టాక్స్ టు బై..
వర్ధమాన్ టెక్స్టైల్స్- బై రూ. 554, స్టాప్ లాస్ రూ. 535, టార్గెట్ రూ. 592
{{/usCountry}}వర్ధమాన్ టెక్స్టైల్స్- బై రూ. 554, స్టాప్ లాస్ రూ. 535, టార్గెట్ రూ. 592
{{/usCountry}}చంబల్ ఫర్టిలైజర్స్- బై రూ. 429, స్టాప్ లాస్ రూ. 414, టార్గెట్ రూ. 460
ఏషియన్ పెయింట్స్- బై రూ. 2328, స్టాప్ లాస్ రూ. 2280, టార్గెట్ రూ. 2380
పవర్ గ్రిడ్ కార్పొరేషన్- బై రూ. 298, స్టాప్ లాస్ రూ. 293, టార్గెట్ రూ. 312
ఔరబిందో ఫార్మా- బై రూ. 1285, స్టాప్ లాస్ రూ. 1260, టార్గెట్ రూ. 1330
టీడీ పవర్ సిస్టెమ్స్- బై రూ. 817, స్టాప్ లాస్ రూ. 800, టార్గెట్ రూ. 855
బీఎస్ఈ- బై రూ. 2973, స్టాప్ లాస్ రూ. 2915, టార్గెట్ రూ. 3120
నెట్వెబ్ టెక్నాలజీస్- బై రూ. 3304, స్టాప్ లాస్ రూ. 3240, టార్గెట్ రూ. 3450