...
...
Next Story

Stock market today : నష్టాలే, నష్టాలు- ఈ రోజు స్టాక్​ మార్కెట్​ పరిస్థితి ఇదే! కారణం..

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​, ముడి చమురు ధర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: May 18, 2026, 08:14:10 IST
Advertisement

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 161 పాయింట్లు పడి 75,238 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 46 పాయింట్లు కోల్పోయి 23,644 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 419 పాయింట్లు పడి 53,710 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్..
స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,329.17 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,958.82 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 76 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50కి 23,200 వద్ద బలమైన సపోర్ట్​ ఉంది. అది హోల్డ్​ అయితే కరెక్షన్ ఆగుతుంది. అదే సమయంలో సూచీకి 24,300 లెవల్ రెసిస్టెన్స్​గా ఉంది. అది దాటితేనే నిఫ్టీ50 పెరుగుతుందన్న క్లారిటీ వస్తుంది,” అని ప్రభుదాస్ లిల్లాధేర్​కి చెందిన వైస్​ ప్రెసిడెంట్, టెక్నికల్​ రీసెర్చ్ వైశాళి పరేఖ్ తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 1.07 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 1.24శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 1.54 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

ఆస్ట్రాజెనెకా ఫార్మా- బై రూ. 8475, స్టాప్ లాస్​ రూ. 8350, టార్గెట్​ రూ. 8650

సుజ్లాన్ ఎనర్జీ- బై రూ. 53.8, స్టాప్​ లాస్​ రూ. 52, టార్గెట్​ రూ. 57

ప్రిస్మ్ జాన్సన్- బై రూ. 128, స్టాప్​ లాస్​ రూ. 125, టార్గెట్​ రూ .133

బ్రేకౌట్ స్టాక్స్​ టు బై..

సంవర్థన మథర్​సన్ ఇంటర్నేషనల్- బై రూ. 130, స్టాప్​ లాస్​ రూ. 124.5, టార్గెట్​ రూ. 140

ఇండో కౌంట్ ఇండస్ట్రీస్- బై రూ. 290, స్టాప్​ లాస్​ రూ. 277, టార్గెట్​ రూ. 315

హెల్త్​కేర్ గ్లోబల్​ ఎంర్​ప్రైజెస్- బై రూ. 637, స్టాప్​ లాస్​ రూ. 607, టార్గెట్​ రూ. 690

గ్రిండ్​వెల్ నార్టన్- బై రూ. 1859, స్టాప్​ లాస్​ రూ. 1780, టార్గెట్​ రూ. 2000

హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్​ప్లొరేషన్ కంపెనీ- బై రూ. 169, స్టాప్​ లాస్​ రూ. 160, టార్గెట్​ రూ. 185

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe