Stock market updates : చమురు ధర డౌన్- మార్కెట్​ జంప్​.. ఈ స్టాక్స్​తో లాభాలు!

Stocks to buy today : ఏప్రిల్​ 21, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Apr 21, 2026, 08:15:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gift nifty live : సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 27 పాయింట్లు పెరిగి 78,520 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 11 పాయింట్లు వృద్ధిచెంది 24,365 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 17 పాయింట్లు పెరిగి 56,582 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ లేటెస్ట్​ అప్డేట్స్..
స్టాక్​ మార్కెట్​ లేటెస్ట్​ అప్డేట్స్..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,059.93 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,966.89 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 85 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50.. 50-డే ఈఎంఐ దగ్గర కన్సాలిడేషన్​ అవుతోంది. హయ్యర్​ హై- హయ్యర్​ హై పాటర్న్​ని ఏర్పాటుచేస్తోంది. నిఫ్టీ50కి 24,100 వద్ద సపోర్ట్​ ఉంది. 24,500 వద్ద కీలక రెసిస్టెన్స్​ ఉంది. ఏది బ్రేక్​ అయినా, సూచీ అటువైపు వెళుతుంది,” అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కి చెందిన టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.01 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.24శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.26 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

ఇరాన్​- అమెరికా మధ్య ఈ వారం శాంతి చర్చలు ఉండొచ్చన్న అంచనాల నేపథ్యంలో ముడి చమురు ధర పడింది. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో బ్రెంట్​ క్రూడ్​ 1శాతం మేర కరెక్ట్​ అయ్యి బ్యారెల్​కి 94.53 డాలర్లకు చేరింది.

స్టాక్స్​ టు బై..

షాపర్స్​ స్టాప్​- బై రూ. 310, స్టాప్​ లాస్​ రూ. 307, టార్గెట్​ రూ. 316

కాన్ఫిడెన్స్​ పెట్రోలియం ఇండియా- బై రూ. 54, స్టాప్​ లాస్​ రూ. 52, టార్గెట్​ రూ. 58

ఐషేర్​ మోటార్స్​- బై రూ. 7220, స్టాప్​ లాస్​ రూ. 7180, టార్గెట్​ రూ. 7300

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

సీఈఎస్​సీ- బై రూ. 179.4, స్టాప్​ లాస్​ రూ. 170, టార్గెట్​ రూ. 193

ఎంఎం ఫోర్డింగ్స్- బై రూ. 485, స్టాప్​ లాస్​ రూ. 460, టార్గెట్​ రూ. 525

రాశి పెరిఫెరల్స్- బై రూ. 474, స్టాప్​ లాస్​ రూ. 450, టార్గెట్​ రూ. 510

సిమెన్స్ ఎనర్జీ ఇండియా- బై రూ. 3138, స్టాప్​ లాస్​ రూ. 2980, టార్గెట్​ రూ. 3138

గ్రిండ్​వెల్​ నార్టన్- బై రూ. 1627, స్టాప్​ లాస్​ రూ. 1550, టార్గెట్​ రూ. 1750

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More