...
...
Next Story

ట్రేడర్స్​ అలర్ట్​- ఈ రూ. 120 స్టాక్​తో లాభాలకు ఛాన్స్​..

నవంబర్​ 21, ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 21, 2025, 08:15:00 IST
Advertisement

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 446 పాయింట్లు పెరిగి 85,633 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 140 పాయింట్లు వృద్ధిచెంది 26,192 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 132 పాయింట్లు పెరిగి 59,348 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

స్టాక్ మార్కెట్​ అప్డేట్స్​..
స్టాక్ మార్కెట్​ అప్డేట్స్​..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 283.65 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 824.46 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈ​​​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 12,074.94 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 51,159.55 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 70 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50 26,100 ఎగువన ఉన్నంత వరకు సూచీలో పాజిటివ్​ సెంటిమెంట్​ కొనసాగుతుంది. దాని దిగువకు పడితే షార్ట్​ టర్మ్​లో నెగిటివ్​గా మారుతుంది. 25,900 వరకు సూచీ వెళ్లొచ్చు. 26,100 పైన ఉన్నంత కాలం నిఫ్టీ50 26,300- ఆ తర్వాతి స్థాయిలకు చేరొచ్చు,” అని ఎల్​కేపీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్​ టెక్నికల్​ ఎనలిస్ట్​ రూపక్​ దే తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.84 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 1.56శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 2.15 శాతం డౌన్​ అయ్యింది.

మాన్​ ఇండస్ట్రీస్​- బై రూ. 464, స్టాప్​ లాస్​ రూ. 448, టార్గెట్​ రూ. 500

ఎంటార్​ టెక్నాలజీస్​- బై రూ. 2696, స్టాప్​ లాస్​ రూ. 2600, టార్గెట్​ రూ. 2900

ఐఈఎక్స్​- బై రూ. 142, స్టాప్​ లాస్​ రూ. 135, టార్గెట్​ రూ. 150

కాన్​కర్​- బై రూ. 516, స్టాప్​ లాస్​ రూ. 500, టార్గెట్​ రూ. 540

పీఎన్​బీ- బై రూ. 123, స్టాప్​ లాస్​ రూ. 118, టార్గెట్​ రూ. 128

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ లిమిటెడ్ (ఏఆర్ఎస్ఎస్బీఎల్): రూ.747 వద్ద కొనుగోలు చేయండి. టార్గెట్ ధర రూ.800; రూ. 720 వద్ద స్టాప్ లాస్.

అనుపమ్ రసాయన్ ఇండియా లిమిటెడ్ (అనురాస్): రూ.1,188కు కొనుగోలు. టార్గెట్ ధర రూ.1,280; రూ.1,145 వద్ద స్టాప్ లాస్.

ఆజాద్ ఇంజనీరింగ్ లిమిటెడ్ (ఆజాద్): రూ.1,740కు కొనుగోలు. టార్గెట్ ధర రూ.1,866; స్టాప్ లాస్ రూ .1,680 వద్ద ఉంది.

సెనోరెస్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (సెనోర్స్): రూ.825కు కొనుగోలు చేయాలి. టార్గెట్ ధర రూ.888; రూ.799 వద్ద స్టాప్ లాస్.

పీడీఎస్ లిమిటెడ్ (పీడీఎస్ఎల్): రూ.407కే కొనండి. టార్గెట్ ధర రూ.437; రూ. 392 వద్ద స్టాప్ లాస్.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe