Stocks to buy : ట్రేడర్స్ అలర్ట్- ఈ రూ. 331 స్టాక్‌తో లాభాలకు ఛాన్స్!
Gift nifty live : ఏప్రిల్ 22, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 753 పాయింట్లు పెరిగి 79,273 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 212 పాయింట్లు వృద్ధిచెంది 24,577 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 789 పాయింట్లు పెరిగి 57,371 వద్దకు చేరింది.

కాగా అమెరికాతో రెండో దఫా చర్చలను ఇరాన్ తిరస్కరించడం కారణంగా ప్రపంచ స్టాక్ మార్కెట్లలో ప్రతికూల వాతావరణం కనిపిస్తోంది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,918.99 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,221.27 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 165 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“టెక్నికల్‌గా చూసుకుంటే నిఫ్టీ50కి 24,350- 24,400 లెవల్స్ కీలక సపోర్ట్‌గా ఉన్నాయి. 24,700- 24,750 వద్ద రెసిస్టెన్స్ కనిపిస్తోంది. డైలీ చార్ట్ చూస్తుంటే మదుపర్లలో కొనుగోళ్ల ఆసక్తి కనిపిస్తోంది,” అని చాయిస్ బ్రోకింగ్‌కి చెందిన ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సుమీత్ బగాడియా వివరించారు.
కాగా అమెరికా- ఇరాన్ యుద్ధం అనిశ్చితి నేపథ్యంలో బిగినర్లు ట్రేడింగ్‌కి దూరంగా ఉండాలని స్టాక్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.59శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.63శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.59 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ వద్ద అనిశ్చితి వేళ ముడి చమురు ధర ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతోంది. బ్రెంట్ క్రూడ్ 0.2శాతం పడి బ్యారెల్‌కి 98.27డాలర్ల వద్ద కొనసాగుతోంది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
బీహెచ్ఈఎల్ - బై రూ. 332.6, స్టాప్ లస్ రూ. 320, టార్గెట్ రూ. 356
బజాజ్ ఫైనాన్స్- బై రూ. 938.85, స్టాప్ లాస్ రూ. 905, టార్గెట్ రూ. 1007
వెల్స్పన్ కార్ప్- బై రూ. 1100.6, స్టాప్ లాస్ రూ. 1061, టార్గెట్ రూ. 1182
హొనాసా కన్జ్యూమర్- బై రూ. 351.6, స్టాప్ లాస్ రూ. 338, టార్గెట్ రూ. 380
లాయిండ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ- బై రూ. 1649.9, స్టాప్ లాస్ రూ. 1590, టార్గెట్ రూ. 1790
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


