Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​- ఈ బ్రేకౌట్​ స్టాక్స్​తో లాభాలకు ఛాన్స్​!

ఫిబ్రవరి 23, ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Feb 23, 2026, 09:22:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 317 పాయింట్లు పెరిగి 82,815 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 117 పాయింట్లు వృద్ధిచెంది 25,571 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 432 పాయింట్లు పెరిగి 61,172 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..
స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 947.57 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,479.99 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈ ఫిబ్రవరి​​​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 2,479.99 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 13,954.02 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఓపెనింగ్​..

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ లాభాల్లో ప్రారంభించాయి. ఉదయం 9 గంటల 25 నిమిషాల ప్రాంతంలో నిఫ్టీ50 150 పాయింట్ల లాభంతో 25,722 వద్ద ట్రేడ్​ అవుతోంది. బ్యాంక్​ నిఫ్టీ 219 పాయింట్లు పెరిగి 61,395 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్​ 534 పాయింట్లు వృద్ధిచెంది 83,348 వద్ద ట్రేడ్​ అవుతోంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. ఏడాదిగా చేస్తున్న టారిఫ్​ దాడులు సరైనది కాదని, ఆ దేశ సుప్రీంకోర్టు వాటిని కొట్టివేసింది. ఇది ట్రంప్​ టీమ్​కి పెద్ద షాక్​గా, అంతర్జాతీయ మార్కెట్​లకు పాజిటివ్​గా మారింది. ఈ నేపథ్యంలోనే సోమవారం దేశీయ సూచీలు భారీ లాభాల్లో ఓపెన్​ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ట్రంప్​ టారిఫ్​ వ్యవహారం నేపథ్యంలో ఏ స్టాక్స్​కి లాభం? పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

ట్రంప్​ సుంకాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు అనంతరం శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.47 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.67శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.90 శాతం పెరిగింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో లాభాల్లో కొనసాగుతున్నాయి.

బంగారం, వెండి ధరలు ఇలా..

బంగారం, వెండి ధరలు సోమవారం ఫిబ్రవరి 23న పరుగులు పెడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్​లో స్పాట్​ గోల్డ్​ 1.6శాతం పెరిగి ఔన్సుకు 5,160 డాలర్లకు చేరింది. మరోవైపు స్పాట్​ సిల్వర్​ 5శాతం వృద్ధి చెంది ఔన్సుకు 86 డాలర్లకు వెళ్లింది.

స్టాక్స్​ టు బై..

వర్ధమాన్​ టెక్స్​టైల్స్​- బై రూ. 536, స్టాప్​ లాస్​ రూ. 517, టార్గెట్​ రూ. 574

ఏబీఎస్​ఎల్​ఏఎంసీ- బై రూ. 918, స్టాప్​ లాస్​ రూ. 885, టార్గెట్​ రూ. 984

బీహెచ్​ఈఎల్​- బై రూ. 257, స్టాప్​ లాస్​ రూ. 252, టార్గెట్​ రూ. 270

కమ్మిన్స్​ ఇండియా- బై రూ. 4733, స్టాప్​ లాస్​ రూ. 4660, టార్గెట్​ రూ. 4900

జేఎస్​డబ్ల్యూ ఎనర్జీ- బై రూ. 493.95, స్టాప్​ లాస్​ రూ. 585, టార్గెట్​ రూ. 520

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

బజాజ్​ కన్జ్యూమర్​ కేర్​- బై రూ. 383, స్టాప్​ లాస్​ రూ. 260, టార్గెట్​ రూ. 410

హ్యాపీ ఫోర్జింగ్స్​- బై రూ. 1347, స్టాప్​ లాస్​ రూ. 1280, టార్గెట్​ రూ. 1445

యథార్త్​ హాస్పిటల్​ అండ్​ ట్రౌమా కేర్​ సర్వీసెస్​- బై రూ. 720, స్టాప్​ లాస్​ రూ. 693, టార్గెట్​ రూ. 775

మహీంద్రా లాజిస్టిక్స్​- బై రూ. 415, స్టాప్​ లాస్​ రూ. 400, టార్గెట్​ రూ. 441

టోరెంట్​ ఫార్మా- బై రూ. 1528, స్టాప్​ లాస్​ రూ. 1475, టార్గెట్​ రూ. 1640

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More