గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 852 పాయింట్లు పడి 77,664 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 205 పాయింట్లు కోల్పోయి 24,173 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 819 పాయింట్లు పడి 56,305 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3,255 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 941 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 65 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“టెక్నికల్‌గా చూసుకుంటే నిఫ్టీ50కి 23,950- 24,000 లెవల్స్ వద్ద కీలక సపోర్ట్ ఉంది. 24,350- 24,400 లెవల్స్ వద్ద రెసిస్టెన్స్ ఉంది,” అని చాయిస్ బ్రోకింగ్‌కి చెందిన సుమిత్ బగాడియా వివరించారు.
కాగా అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా బిగినర్లు ట్రేడింగ్‌లో జాగ్రత్తగా ఉండాలని స్టాక్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.37 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.41శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.89 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
{{/usCountry}}అమెరికా ఇరాన్ మధ్య అనిశ్చితి నేపథ్యంలో ముడి చమురు ధర విపరీతంగా పెరుగుతోంది. శుక్రవారం సైతం బ్రెంట్ క్రూడ్ ధర 1.17శాతం పెరిగి బ్యారెల్‌కి 106.3 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
సాయ్ లైఫ్ సైన్సెస్- బై రూ. 1041, స్టాప్ లాస్ రూ. 1000, టార్గెట్ రూ. 1111
బ్లాక్ బాక్స్- బై రూ. 548, స్టాప్ లాస్ రూ. 525, టార్గెట్ రూ. 585
నోసిల్- బై రూ. 182.5, స్టాప్ లాస్ రూ. 174, టార్గెట్ రూ. 195
ప్రివి స్పెషాలిటీ కెమికల్స్- బై రూ. 3250, స్టాప్ లాస్ రూ. 3115, టార్గెట్ రూ. 3450
గ్రాన్యూల్స్ ఇండియా- బై రూ. 686, స్టాప్ లాస్ రూ. 665, టార్గెట్ రూ. 725