శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 3 పాయింట్లు పెరిగి 77,541 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 20 పాయింట్లు వృద్ధిచెంది 24,252 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 266 పాయింట్లు పెరిగి 57,762 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 542.71 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,124.14 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 45 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 24,200- 24,100 లెవల్స్ కీలక సపోర్ట్‌గా ఉన్నాయి. ఇది బ్రేక్ అయితే ఇండెక్స్ మరింత కిందకు పడొచ్చు. 24,300 జోన్ కీలక రెసిస్టెన్స్‌గా ఉంది,” అని ఎన్రిచ్ మనీ సీఈఓ పొన్ముడి ఆర్ తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.98 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.43శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.9435 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అంతర్జాతీయ అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ ముడి చమురు ధర సోమవారం కాస్త పడింది. బ్రెంట్ క్రూడ్ దాదాపు 1.3శాతం పడి బ్యారెల్‌కు 93.17 డాలర్లకు చేరింది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
హిందుస్థాన్ జింక్- బై రూ. 595, స్టాప్ లాస్ రూ. 574, టార్గెట్ రూ. 636
{{/usCountry}}హిందుస్థాన్ జింక్- బై రూ. 595, స్టాప్ లాస్ రూ. 574, టార్గెట్ రూ. 636
{{/usCountry}}నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా- బై రూ. 5601, స్టాప్ లాస్ రూ. 5400, టార్గెట్ రూ. 6000
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ- బై రూ. 515, స్టాప్ లాస్ రూ. 497, టార్గెట్ రూ. 550
ప్రైమ్ ఫోకస్ లిమిటెడ్- బై రూ. 296, స్టాప్ లాస్ రూ. 285, టార్గెట్ రూ. 317
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా- బై రూ. 272.4, స్టాప్ లాస్ రూ. 262, టార్గెట్ రూ. 292