...
...
Next Story

Stock Market today : పెరుగుతూనే ఉన్న చమురు ధర- స్టాక్​ మార్కెట్​ పరిస్థితేంటి? ఏ స్టాక్స్​తో లాభాలు?

Stock market updates : ఏప్రిల్​ 28, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Apr 28, 2026, 08:14:22 IST
Advertisement

అమెరికా- ఇరాన్ ఉద్రిక్తతల మధ్య తీవ్ర ఒడుదొడుకులకు గురవుతున్న సూచీలు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 639 పాయింట్లు పెరిగి 77,304 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 195 పాయింట్లు వృద్ధిచెంది 24,093 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 174 పాయింట్లు పెరిగి 56,264 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

స్టాక్​ మార్కెట్ లేటెస్ట్​ అప్డేట్స్..
స్టాక్​ మార్కెట్ లేటెస్ట్​ అప్డేట్స్..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,152 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,124 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 70 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“ప్రస్తుతం మార్కెట్​లో ఒడుదొడుకులు కనిపిస్తున్నాయి. స్టాక్​-స్పెసిఫిక్​ అప్రోచ్​ తీసుకోవడం ఉత్తమం. ఎనర్జీ, మెటల్స్, ఫార్మా వంటి బలం కనిపిస్తున్న సెక్టార్లను ఎంచుకోవడం మంచిది. కానీ భౌగోళిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలి,” అని రెలిగేర్​ బ్రోకింగ్ లిమిటెడ్​ ఎస్​వీపీ రీసెర్చ్ అజిత్​ మిశ్రా తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.13 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.12శాతం పెరిగింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.20 వృద్ధిని చూసింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

జేఎస్​డబ్ల్యూ ఎనర్జీ- బై సీఎంపీ, స్టాప్​ లాస్​ రూ. 555, టార్గెట్​ రూ. 608

సోనా బీఎల్​డబ్ల్యూ ప్రెసిషన్- బై సీఎంపీ, స్టాప్​ లాస్​ రూ. 570, టార్గెట్​ రూ. 620

ఎన్​ఎండీసీ- బై సీఎంపీ, స్టాప్​ లాస్​ రూ. 87.8, టార్గెట్​ రూ. 96

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

జెన్​ టెక్నాలజీస్- బై రూ. 1719.7, స్టాప్​ లాస్​ రూ. 1659, టార్గెట్​ రూ. 1840

ఫోర్టిస్ హెల్త్​కేర్- బై రూ. 953.8, స్టాప్​ లాస్​ రూ. 920, టార్గెట్​ రూ. 1021

రైట్స్​- బై రూ. 222.38, స్టాప్​ లాస్​ రూ. 214, టార్గెట్​ రూ. 238

నైకా- బై రూ. 269.2, స్టాప్​ లాస్​ రూ. 259.7, టార్గెట్​ రూ. 290

జేబీఎం ఆటో- బై రూ. 628.75, స్టాప్​ లాస్​ రూ. 606, టార్గెట్​ రూ. 675

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe