Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్- ఈ 8 స్టాక్స్‌తో లాభాలకు ఛాన్స్..
మార్చ్ 6, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 900 పాయింట్లు పెరిగి 80,016 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 284 పాయింట్లు వృద్ధిచెంది 24,766 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 301 పాయింట్లు పెరిగి 59,056 వద్దకు చేరింది.
కాగా ఇరాన్, అమెరికా- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతోంది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3,752.52 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,153.37 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 250 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 24,600- 24,500 లెవల్స్ వద్ద కీలక సపోర్ట్ ఉంది. సూచీ దీని కింద స్థిరపడితే, అమ్మకాల ఒత్తిడి మరింత పెరగొచ్చు. 24,950- 25,000 వద్ద రెసిస్టెన్స్ ఉంది,” అని కొటాక్ సెక్యూరిటీస్ హెడ్ ఆఫ్ ఈక్విటీ రీసెర్ఛ్ శ్రీకాంత్ చౌహాన్ అభిప్రాయపడ్డారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 1.16 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.56శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.26 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
చమురు ధరలు..
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో గత కొన్ని రోజుల పటు పెరిగిన ముడి చమురు ధర శుక్రవారం అతి స్వల్పంగా పడింది. బ్యారెల్ క్రూడ్ ధర 0.5శాతం పడి 81.02 డాలర్లకు చేరింది.
బంగారం, వెండి ధరలు ఇలా..
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర 0.2శాతం పెరిగి ఔన్సుకు 5,093.63 డాలర్లుగా ఉంది. ఇక స్పాట్ సిల్వర్ ధర 0.3శాతం పెరిగి 82.47 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
స్టాక్స్ టు బై..
బీఈఎల్- బై రూ. 460, టార్గెట్ రూ. 492, స్టాప్ లాస్ రూ. 444
జీఈఎస్హెచ్ఐపీ- బై రూ. 1389, టార్గెట్ రూ. 1487, స్టాప్ లాస్ రూ. 1340
సిప్లా- బై రూ. 1327, టార్గెట్ రూ. 1370, స్టాప్ లాస్ రూ. 1300
నాల్కో- బై రూ. 395, టార్గెట్ రూ. 410, స్టాప్ లాస్ రూ. 380
ఎంసీఎక్స్- బై రూ. 2551, టార్గెట్ రూ. 2630, స్టాప్ లాస్ రూ. 2450
ఎం అండ్ ఎం- బై రూ. 3348, టార్గెట్ రూ. 2470, స్టాప్ లాస్ రూ. 3285
కమిన్స్ ఇండియా- బై రూ. 4791, టార్గెట్ రూ. 4970, స్టాప్ లాస్ రూ. 4700
పవర్ గ్రిడ్ కార్పొరేషన్- బై రూ. 299.45, టార్గెట్ రూ. 317, స్టాప్ లాస్ రూ. 291
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper












