Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​- ఈ రూ. 160 బ్రేకౌట్ స్టాక్​తో లాభాలకు ఛాన్స్​!

Stock market updates : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు ముడి చమురు ధరలు, లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Apr 7, 2026, 08:15:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 787 పాయింట్లు పెరిగి 74,107 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 255 పాయింట్లు వృద్ధిచెంది 22,968 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 1060 పాయింట్లు పెరిగి 52,609 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ లేటెస్ట్​ అప్డేట్స్..
స్టాక్​ మార్కెట్​ లేటెస్ట్​ అప్డేట్స్..

అమెరికా- ఇరాన్​కి ముందు కాల్పుల విరమణ ప్రతిపాదన వెళ్లిందన్న వార్తలతో దేశీయ స్టాక్​ మార్కెట్​లతో పాటు ప్రపంచ సూచీలు నెగిటివ్​ నుంచి పాజిటివ్​కి మారాయి. అయితే, ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్​ తిరస్కరించిందని ప్రస్తుతం మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 8,167.17 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 8,088.70 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 95 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50 డైలీ చార్ట్​లో లోయర్​ షాడోతో కూడిన భారీ బుల్​ క్యాండిల్​ ఏర్పడింది. ఇది షార్ట్​టర్మ్​ బాటమ్ రివర్సల్​కి సంకేతం. నిఫ్టీ50కి 23,000 వద్ద రెసిస్టెన్స్​ ఉంది. అది దాటితే సూచీ 23,500 వరకు వెళ్లొచ్చు. 22,600 లెవల్స్​ వద్ద సపోర్ట్​ ఉంది,” అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్​ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.3 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.45శాతం వృద్ధి చెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.54 శాతం పెరిగింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధరలు..

ఇరాన్​ యుద్ధం అనిశ్చితి కారణంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం బ్రెంట్​ క్రూడ్​ ధర బ్యారెల్​కి 0.5శాతం పెరిగి 110.34 డాలర్లకు చేరింది.

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

లాయిడ్స్​ మెటల్స్​ అండ్​ ఎనర్జీ- బై రూ. 1436.7, స్టాప్​ లాస్​ రూ. 1360, టార్గెట్​ రూ. 1700

నైకా- బై రూ. 252.5, స్టాప్​ లాస్​ రూ. 243, టార్గెట్​ రూ. 280

ఆదిత్య బిర్లా సన్​ లైఫ్​ ఏఎంసీ- బై రూ. 947.10, స్టాప్​ లాస్​ రూ. 914, టార్గెట్​ రూ. 1040

సెయిల్​- బై రూ. 160.4, స్టాప్​ లాస్​ రూ. 154.5, టార్గెట్​ రూ. 174

ప్రాజ్​ ఇండస్ట్రీస్​- బై రూ. 344.75, స్టాప్​ లాస్​ రూ. 331, టార్గెట్​ రూ. 372

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More