Stock market crash : ఇరాన్‌పై దాడులు- ఈరోజు స్టాక్ మార్కెట్ క్రాష్! ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు..
పశ్చిమాసియాలో ఉద్రిక్తితల వేళ ఇన్వెస్టర్లను కలవరపెట్టే వార్త! బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 550 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
హోలీ సందర్భంగా మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు లభించింది. ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1048 పాయింట్లు పడి 80,239 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 313 పాయింట్లు కోల్పోయి 24,866 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 689 పాయింట్లు పడి 59,840 వద్దకు చేరింది.

పశ్చిమాసియాలో ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ దాడులతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు పతనం అవుతున్నాయి. ఇందులో భాగంగా దేశీయ ఇన్వెస్టర్లు సైతం నష్టాలు చూడక తప్పడం లేదు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3,295.64 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 8,593.87 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ అతి భారీ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 550 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 ట్రెండ్ నెగిటివ్‌గా ఉంది. 25,100 వద్ద బలమైన రెసిస్టెన్స్ కూడా ఉంది. కానీ 24,600 దిగువకు సూచీ పడిపోతే మరింత సెల్లింగ్ ప్రెజర్ కనిపించవచ్చు. నిఫ్ట50 24,300 వరకు కూడా వెళ్లొచ్చు,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.8 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.94శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.02 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి. జపాన్ నిక్కీ 2.5శాతం పతనమైంది. సౌత్ కొరియా కాస్పీ ఏకంగా 6.19శాతం పడిపోయింది.
ముడి చమురు ధరలు..
అమెరికా- ఇజ్రాయెల్‌తో ఘర్షణల నేపథ్యంలో ప్రపంచ చమురు సరఫరాకు జీవనాధారం అయిన హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఇది ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి.
ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 83 డాలర్ల చేరువలో ఉంది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
త్రివేణి ఇంజినీరింగ్ అండ్ ఇండస్ట్రీస్- బై రూ. 395.4, స్టాప్ లాస్ రూ. 370, టార్గెట్ రూ. 445
హిందుస్థాన్ జింక్- బై రూ. 617.6, స్టాప్ లాస్ రూ. 585, టార్గెట్ రూ. 675
జిందాల్ పాలీ ఫిల్మ్స్- బై రూ. 627.35, స్టాప్ లాస్ రూ. 590, టార్గెట్ రూ. 700
లుపిన్- బై రూ. 2311.10, స్టాప్ లాస్ రూ. 2200, టార్గెట్ రూ. 2500
ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రాడక్ట్స్- బై రూ. 982.4, స్టాప్ లాస్ రూ. 940, టార్గెట్ రూ. 1050
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


