...
...
Next Story

ట్రేడర్స్​ అలర్ట్​- మీ వాచ్​లిస్ట్​లో కచ్చితంగా ఉండాల్సిన 10 స్టాక్స్​ ఇవి..

ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 7, 2025, 08:15:07 IST
Advertisement

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 148 పాయింట్లు పడి 83,311 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 88 పాయింట్లు కోల్పోయి 25,510 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 273 పాయింట్లు పడి 57,554 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

స్టాక్​ మార్కెట్​ అప్​డేట్స్​..
స్టాక్​ మార్కెట్​ అప్​డేట్స్​..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 3,263.21 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,283.91 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈ నవంబర్​​​​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 6,214.00 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 10,003.17 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 130 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“కీలక 21ఈఎంఐ సపోర్ట్​కి కిందకు నిఫ్టీ50 పడిపోయింది. అంటే సూచీలో బలం లేనట్టు! 25,450 దిగువకు కూడా పడిపోతే నిఫ్టీ50 షార్ట్​ టర్మ్​ ట్రెండ్​ నెగిటివ్​గా మారినట్టు అవుతుంది. 24,450 ఎగువన ఉంటే ట్రెండ్​ రివర్సెల్​కి ఛాన్స్​ ఉంది,” అని ఎల్​కేపీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్​ టెక్నికల్​ ఎనలిస్ట్​ రూపక్​ దే తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.84 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 1.12శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 1.90 శాతం డౌన్​ అయ్యింది.

డాబర్​ ఇండియా- బై రూ. 524, స్టాప్​ లాస్​ రూ. 506, టార్గెట్​ రూ. 560

పీఐ ఇండస్ట్రీస్​- బై రూ. 3750, స్టాప్​ లాస్​ రూ. 3620, టార్గెట్​ రూ. 4010

ఎన్​టీపీసీ- బై రూ. 326, స్టాప్​ లాస్​ రూ. 316, టార్గెట్​ రూ. 342

బీఈఎల్​- బై రూ. 408, స్టాప్​ లాస్​ రూ. 400, టార్గెట్​ రూ. 430

మారుతీ సుజుకీ ఇండియా- బై రూ. 16450, స్టాప్​ లాస్​ రూ. 16000, టార్గెట్​ రూ. 16800

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

ఆదిత్య ఇన్ఫోటెక్: రూ .1402 వద్ద కొనండి, లక్ష్యం రూ .1500, స్టాప్ లాస్ రూ .1350;

సెనోరెస్ ఫార్మాస్యూటికల్స్: రూ .799 వద్ద కొనండి, లక్ష్యం రూ .860, స్టాప్ లాస్ రూ .770;

అట్లాంటా ఎలక్ట్రికల్స్: రూ .995 వద్ద కొనుగోలు, లక్ష్యం రూ .1070, స్టాప్ లాస్ రూ .965;

ఆనంద్ రాఠి షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్: రూ .539 వద్ద కొనండి, టార్గెట్ రూ .580, స్టాప్ లాస్ రూ .520;

సాకర్ హెల్త్​కేర్: రూ.390 వద్ద కొనండి, టార్గెట్ రూ.420, స్టాప్ లాస్ రూ.375.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe