Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​- ఈ 5 బ్రేకౌట్​ స్టాక్స్​తో లాభాలకు ఛాన్స్​..!

Stock market updates : మార్చ్​ 20, ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Mar 20, 2026, 08:16:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇరాన్​- ఇజ్రాయెల్​, అమెరికా మధ్య యుద్ధం మరింత ముదరడం, ప్రపంచ ఎనర్జీ మార్కెట్​ తీవ్ర అనిశ్చితిలోకి జారుకోవడం వంటి కారణాలతో గురువారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్ ఏకంగా​ 2497 పాయింట్లు పడి 74,207 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 776 పాయింట్లు కోల్పోయి 23,002 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 1875 పాయింట్లు పడి 53,451 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..
స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 7,558.19 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,863.96 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 125 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50 డైలీ చార్ట్​లో అప్పర్​- లోయర్​ షాడోలతో కూడిన బేరిష్​ క్యాండిల్​ ఏర్పడింది. ప్రస్తుతం సూచీ చాలా వీక్​గా ఉంది. 23,350 వద్ద నిఫ్టీ50కి రెసిస్టెన్స్​ ఉంది. సూచీ ఒకవేళ 22,900 దిగువకు చేరితే అక్కడి నుంచి 22,500కి కూడా వెళ్లొచ్చు,” అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కి చెందిన నాగరాజ్​ శెట్టి తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.44 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.27శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.28 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధరలు..

ముడి చమురు​ ధరలు శుక్రవారం 1శాతం మేర పడ్డాయి. బ్రెంట్​ క్రూడ్​ 1.01శాతం పడి బ్యారెల్​కు 107.57 డాలర్లకు చేరింది.

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

టోరెంట్​ పవర్​- బై రూ. 1445.90, స్టాప్​ లాస్​ రూ. 1380, టార్గెట్​ రూ. 1580

భారత్​ హెవీ ఎలక్ట్రానిక్స్​- బై రూ. 251.75, స్టాప్​ లాస్​ రూ. 239, టార్గెట్​ రూ. 275

లిండే ఇండియా- బై రూ. 7011.5, స్టాప్​ లాస్​ రూ. 6700, టార్గెట్​ రూ. 7500

ఫర్టిలైజర్స్​ అండ్​ కెమికల్స్​ ట్రావెన్​కోర్​- బై రూ. 787.9, స్టాప్​ లాస్​ రూ. 750, టార్గెట్​ రూ. 860

కోల్​ ఇండియా- బై రూ. 454.20, స్టాప్​ లాస్​ రూ. 438, టార్గెట్​ రూ. 475

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More