మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1376 పాయింట్లు పెరిగి 74,068 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 400 పాయింట్లు వృద్ధిచెంది 22,912 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 1168 పాయింట్లు పెరిగి 52,606 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 8,009.56 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,867.15 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 225 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అని ఎల్కేపీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ రూపక్ దే తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.18 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.37శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.84 శాతం డౌన్ అయ్యింది.
“నిఫ్టీ50 డైలీ ఛార్జ్‌లో అప్పర్- లాంగ్ లోయర్ షాడోతో కూడిన చిన్న బుల్ క్యాండిల్ ఏర్పడింది. సాధారణంగా ఇది షార్ప్ బౌన్స్ బ్యాక్‌కి సిగ్నల్. కానీ దీనిని మార్కెట్ కన్ఫర్మ్ చేయాలి. 23,500- 23,600 లెవల్స్ దగ్గర కీలక రెసిస్టెన్స్ ఉంది. అది దాటితే బాటమ్ రివర్సల్ పాటర్న్ కన్ఫర్మ్ అవ్వొచ్చు. 22,600- 22,500 లెవల్స్ దగ్గర కీలక సపోర్ట్ ఉంది,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
ముడి చమురు ధరలు ఈరోజు..
చాలా రోజుల తర్వాత ముడి చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్ల దిగువకు చేరుకుంది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ 5.82శాతం పతనమై బ్యారెల్‌కి 98.4డాలర్లకు చేరింది.
బంగారం, వెండి ధరలు ఈరోజు..
{{/usCountry}}చాలా రోజుల తర్వాత ముడి చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్ల దిగువకు చేరుకుంది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ 5.82శాతం పతనమై బ్యారెల్‌కి 98.4డాలర్లకు చేరింది.
బంగారం, వెండి ధరలు ఈరోజు..
{{/usCountry}}అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో బుధవారం బంగారం ధర సుమారు 4 శాతం పెరిగి ప్రతి ఔన్సుకు 4,600 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అటు వెండి ధర మరింత వేగంగా పెరిగి 7 శాతం వృద్ధితో 74.42 డాలర్ల వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
సెనైడర్ ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్- బై రూ. 895, స్టాప్ లాస్ రూ. 861, టార్గెట్ రూ. 955
సీసీఎల్ ప్రాడక్ట్స్- బై రూ. 1080, స్టాప్ లాస్ రూ. 1029, టార్గెట్ రూ. 1178
స్టెరిలైట్ టెక్నాలజీస్- బై రూ. 180, స్టాప్ లాస్ రూ. 170, టార్గెట్ రూ. 195
గ్రాన్యూల్స్ ఇండియా- బై రూ. 606, స్టాప్ లాస్ రూ. 574, టార్గెట్ రూ. 650
అలివుస్ లైఫ్ సైన్సెస్- బై రూ. 967, స్టాప్ లాస్ రూ. 929, టార్గెట్ రూ. 1038