...
...
Next Story

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​- ఈ బ్రేకౌట్​ స్టాక్స్​లో ట్రేడ్​తో లాభాలకు ఛాన్స్​..

Stock Market today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Apr 1, 2026, 09:00:48 IST
Advertisement

మహావీర్​ జయంతి సందర్భంగా మంగళవారం దేశీయ స్టాక్​ మార్కెట్​లకు సెలవు లభించింది. ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని సూచీలు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1,636 పాయింట్లు పడి 71,948 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 488 పాయింట్లు కోల్పోయి 22,331 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 1999 పాయింట్లు పడి 50,275 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ లేటెస్ట్​ అప్డేట్స్​..
స్టాక్​ మార్కెట్​ లేటెస్ట్​ అప్డేట్స్​..

ఇరాన్​ యుద్ధం నేపథ్యంలో గత నెల రోజులుగా ప్రపంచ స్టాక్​ మార్కెట్​లతో పాటు దేశీయ సూచీలు భారీ స్థాయిలో పడుతూనే ఉన్నాయి. కాగా యుద్ధం త్వరగా ముగిసిపోతుందని తాజాగా అందుతున్న సంకేతాల కారణంగా ప్రపంచ స్టాక్​ మార్కెట్​లలో ఒక్కసారిగా లాభాల ర్యాలీ కనిపిస్తోంది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 11,163.06 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 14,894.72 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ అతి భారీ లాబాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 445 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50లో వీక్​నెస్​ కనిపిస్తోంది. రివర్సల్​కి ఇంకా సంకేతాలు కనిపించలేదు. సూచీ ఇక్కడి నుంచి 22,000- 21,900కి వెళ్లొచ్చు. 22,500 వద్ద రెసిస్టెన్స్​ ఉంది,” అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్​ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు భారీ లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 2.4 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 2.91 శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 3.8 శాతం పెరిగింది.

ముడి చమురు ధరలు బుధవారం స్వల్పంగా పెరిగాయి. బ్రెంట్​ క్రూడ్​ 0.54శాతం పెరిగి బ్యారెల్​కి 104.51 డాలర్లకు చేరింది.

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

గ్లాక్సో స్మిత్​క్లైన్​ ఫార్మా- బై రూ. 2283, స్టాప్​ లాస్​ రూ. 2217, టార్గెట్​ రూ. 2420

ఇప్​కా ల్యాబ్స్​- బై రూ. 1601.2, స్టాప్​ లాస్​ రూ. 1547, టార్గెట్​ రూ. 1710

ఆర్​హెచ్​ ఐ మాగ్నెసిటా ఇండియా- బై రూ. 337.8, స్టాప్​ లాస్​ రూ. 323, టార్గెట్​ రూ .275

సమ్మాన్​ క్యాపిటల్​- బై రూ. 149.5, స్టాప్​ లాస్​ రూ. 144.8, టార్గెట్​ రూ. 160

కేఎస్​బీ- బై రూ. 796.8, స్టాప్​ లాస్​ రూ. 774, టార్గెట్​ రూ. 850

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe