Stocks to buy : ట్రేడర్స్​ అలర్ట్​- ఈ 5 బ్రేకౌట్​ స్టాక్స్​తో లాభాలకు ఛాన్స్..!

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Apr 17, 2026, 08:15:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 123 పాయింట్లు పడి 77,989 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 35 పాయింట్లు కోల్పోయి 24,197 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 216 పాయింట్లు పడి 56,086 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ లేటెస్ట్​ అప్డేట్స్..
స్టాక్​ మార్కెట్​ లేటెస్ట్​ అప్డేట్స్..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 382 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3428 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ స్వల్ప నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 60 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“టెక్నికల్​గా నిఫ్టీ50కి 24,415 వద్ద బలమైన రెసిస్టెన్స్​ ఉంది. రానున్న 1-2 రోజుల్లో సూచీ స్వల్పంగా కరెక్ట్​ అయ్యే అవకాశం ఉంది. నిఫ్టీ50కి 24,100- 24,000 లెవల్స్​ వద్ద కీలక సపోర్ట్​ ఉంది,” అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.24 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.26శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.36 శాతం పెరిగింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

ఇరాన్​- అమెరికా మధ్య శాంతి చర్చల నేపథ్యంలో ముడి చమురు ధరలు దిగొస్తున్నాయి. బ్రెంట్​ క్రూడ్​ ప్రస్తుతం 1.35శాతం పడి బ్యారెల్​కి 98.05 డాలర్లకు చేరింది.

బ్రేకౌట్ స్టాక్స్​ టు బై..

నియోజెన్​ కెమికల్స్- బై రూ. 1502, స్టాప్​ లాస్​ రూ. 1440, టార్గెట్​ రూ. 1610

ఆస్ట్రా మైక్రోవేవ్- బై రూ. 1074, స్టాప్​ లాస్​ రూ. 1026, టార్గెట్​ రూ. 11250

సెనోరెస్​ ఫార్మా- బై రూ. 890, స్టాప్​ లాస్​ రూ. 847, టార్గెట్​ రూ. 955

అలైడ్​ బ్లెండర్స్ అండ్​ డిస్టిల్లర్స్- బై రూ. 540, స్టాప్​ లాస్​ రూ. 515, టార్గెట్​ రూ. 575

ఐఎఫ్​సీఐ- బై రూ. 60.73, స్టాప్​ లాస్​ రూ. 57.6, టార్గెట్​ రూ. 65.5

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More