సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 65 పాయింట్లు పడి 85,642 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 27 పాయింట్లు కోల్పోయి 26,176 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 71 పాయింట్లు పడి 59,681 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,171.31 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,558.93 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ 2 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 26,200- 26,300 దగ్గర బలమైన కాల్ రైటింగ్ కనిపిస్తోంది. షార్ట్ టర్మ్‌లో సూచీ సైడ్‌వేస్‌లోకి వెళ్లొచ్చు. 26,100 దగ్గర సపోర్ట్ ఉంది. 26300 వద్ద బలమైన రెసిస్టెన్స్ ఉంది,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్‌కి చెందిన టెక్నికల్ ఎనలిస్ట్ వాత్సల్ భువ తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.90 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.53శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.38 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
సిటీ యూనియన్ బ్యాంక్- బై రూ. 283, స్టాప్ లాస్ రూ. 273, టార్గెట్ రూ. 303
{{/usCountry}}సిటీ యూనియన్ బ్యాంక్- బై రూ. 283, స్టాప్ లాస్ రూ. 273, టార్గెట్ రూ. 303
{{/usCountry}}వన్ 97 కమ్యూనికేషన్స్ (పేటీఎం)- బై రూ. 1368, స్టాప్ లాస్ రూ. 1320, టార్గెట్ రూ. 1465
గెయిల్- బై రూ. 175, స్టాప్ లాస్ రూ. 170, టార్గెట్ రూ. 183
సీజీ పవర్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ లిమిటెడ్- బై రూ. 670, స్టాప్ లాస్ రూ. 655, టార్గెట్ రూ. 690
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్- బై రూ. 270, స్టాప్ లాస్ రూ. 260, టార్గెట్ రూ. 288
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
నాలెడ్జ్ మెరైన్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్: రూ .2988 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ .3200, స్టాప్ లాస్ రూ .2888;
క్యూపిడ్: రూ .349 వద్ద కొనండి, లక్ష్యం రూ .375, స్టాప్ లాస్ రూ .337;
గరుడ కన్ స్ట్రక్షన్ అండ్ ఇంజినీరింగ్: రూ .219 వద్ద కొనండి, టార్గెట్ రూ .236, స్టాప్ లాస్ రూ .211;
యాత్ర ఆన్ లైన్: రూ .181.65 వద్ద కొనండి, టార్గెట్ రూ .195, స్టాప్ లాస్ రూ .175;
గోకుల్ ఆగ్రో రిసోర్సెస్: రూ .217 వద్ద కొనండి, టార్గెట్ రూ .233, స్టాప్ లాస్ రూ .210.