Stocks to buy : ఈ రోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది? ఏ స్టాక్స్‌తో లాభాలు?
ఫిబ్రవరి 2, ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
బడ్జెట్ 2026 సందర్భంగా ఆదివారం నిర్వహించిన ట్రేడింగ్ సెషన్లో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1547 పాయింట్లు పడి 80,723 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 495 పాయింట్లు పతనమై 24,825 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 1193 పాయింట్లు పడి 58,417 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
ఆదివారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 611.69 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 853.33 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు.
జనవరి నెలలో ఎఫ్ఐఐలు మొత్తం మీద రూ. 41,435.22 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 69,220.74 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 50 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“కీలకమైన 25,000 సపోర్ట్‌ని నిఫ్టీ50 బ్రేక్ చేసింది. ఇది సానుకూల విషయం కాదు. ఛార్ట్ పాటర్న్ కూడా నెగిటివ్‌గా ఉంది. నిఫ్టీ50కి 24,500- 24,400 వద్ద మరో సపోర్ట్ ఉంది. 24,900- 25,000 వద్ద రెసిస్టెన్స్ ఉంది,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.3 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.4శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.2 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
మేదాంత్- బై రూ. 1120, స్టాప్ లాస్ రూ. 1080, టార్గెట్ రూ. 1200
నెట్వెబ్ టెక్నాలజీస్- బై రూ. 3305, స్టాప్ లాస్ రూ. 3190, టార్గెట్ రూ. 3535
విప్రో- బై రూ. 241, స్టాప్ లాస్ రూ. 230, టార్గెట్ రూ. 262
టీసీఎస్- బై రూ. 3180, స్టాప్ లాస్ రూ. 3100, టార్గెట్ రూ. 3400
మ్యాక్స్ హెల్త్- బై రూ. 974, స్టాప్ లాస్ రూ. 950, టార్గెట్ రూ. 1010
కేన్స్ టెక్నాలజీ- బై రూ. 3560, స్టాప్ లాస్ రూ. 3480, టార్గెట్ రూ. 3760
ఏథర్ ఎనర్జీ- బై రూ. 626, స్టాప్ లాస్ రూ. 612, టార్గెట్ రూ. 666
ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్- బై రూ. 570, స్టాప్ లాస్ రూ. 556, టార్గెట్ రూ. 615
బంగారం, వెండి ధరలు..
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర 1.5 శాతం క్షీణించి, ఒక ఔన్సు బంగారం ధర 4,793.97 డాలర్ల వద్దకు పడిపోయింది. అయితే, ఫిబ్రవరి డెలివరీకి సంబంధించి అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ మాత్రం 1.6 శాతం పెరిగి 4,818.10 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
మరోవైపు, మూడు వారాల కనిష్ట స్థాయికి పడిపోయిన వెండి ధరలు స్వల్పంగా కోలుకున్నాయి. స్పాట్ సిల్వర్ ధర 1.6 శాతం పెరిగి ఒక ఔన్సు 85.98 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
భారతీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో ఆదివారం ముగిసిన ట్రేడింగ్‌లో ధరలు భారీగా పడిపోయాయి:
బంగారం: ఏప్రిల్ ఫ్యూచర్స్ గోల్డ్ రేటు ఏకంగా రూ. 4,242 (2.87%) తగ్గి, 10 గ్రాముల బంగారం ధర రూ. 1,48,104 వద్ద ముగిసింది.
వెండి ధరల్లో ఊహించని పతనం చోటుచేసుకుంది. మార్చి ఫ్యూచర్స్ సిల్వర్ ధర ఏకంగా 9 శాతం క్షీణించి లోయర్ సర్క్యూట్‌ను తాకింది. ఒక్కరోజే కిలో వెండిపై రూ. 26,273 తగ్గడంతో ధర రూ. 2,65,652 వద్ద స్థిరపడింది.
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


