శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 232 పాయింట్లు పెరిగి 75,415 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 65 పాయింట్లు వృద్ధిచెంది 23,719 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 616 పాయింట్లు పెరిగి 54,055 వద్దకు చేరింది.

అమెరికా- ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై ఆశలు చిగురించిన నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్ సెషన్లో ముడి చమురు ధర భారీగా పతనమైంది. ఫలితంగా ప్రపంచ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకెళుతున్నాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 4,440.47 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 6,003.53 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 250 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 23,150- 23,250 జోన్ తక్షణ సపోర్ట్‌గా ఉంది. అది బ్రేక్ అయితే సూచీ 22,900 మార్క్ వరకు వెళ్లొచ్చు. ఇక 23,800- 24,00 లెవల్స్ కీలక రెసిస్టెన్స్‌గా ఉన్నాయి. అది దాటితే సూచీ 24,500- 24,650 వరకు వెళ్లొచ్చు,” అని రెలిగేర్ బ్రోకింగ్‌కి చెందిన అజిత్ మిశ్రా తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.58 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.27శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.19 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో భారీ లాభాల్లో దూసుకెళుతున్నాయి.
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో భారీ లాభాల్లో దూసుకెళుతున్నాయి.
{{/usCountry}}భారత దేశ సూచీలు ఇంకా నష్టాల్లో కొట్టుమిట్టాడుతుండగా.. అమెరికా, జపాన్ వంటి స్టాక్ మార్కెట్లు ప్రతిరోజూ నూతన గరిష్ఠాలను హిట్ చేస్తున్నాయి. రూపాయి పతనం, ఎఫ్ఐఐల భారీ అమ్మకాలు వంటి కారణాలతో మన స్టాక్ మార్కెట్లు ఇంకా తేరుకోలేకపోతున్నాయి.
చమురు ధర..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 5.08శాతం క్రాష్ అయ్యింది. ప్రస్తుతం బ్యారెల్‌కు 98.28 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
మీషో- బై రూ. 198, స్టాప్ లాస్ రూ. 195, టార్గెట్ రూ. 205
మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్- బై రూ. 1652, స్టాప్ లాస్ రూ. 1620, టార్గెట్ రూ. 1750
జీఐపీసీఎల్- బై రూ. 149, స్టాప్ లాస్ రూ. 145, టార్గెట్ రూ. 160