శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 401 పాయింట్లు పడి 85,232 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 124 పాయింట్లు కోల్పోయి 26,068 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 480 పాయింట్లు పడి 58,868 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,766.05 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,161.61 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 13,840.99 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 54,321.16 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 90 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 షార్ట్ టర్మ్ ట్రెండ్ నెగిటివ్‌గా ఉంది. ఈ డౌన్‌ట్రెండ్ 25,920-25,900 లెవల్స్ వరకు వెళ్లొచ్చు. 26,160 వద్ద రెసిస్టెన్స్ ఉంది. అది దాటితే సెంటిమెంట్ మారొచ్చు,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ ఎనలిస్ట్ రూపక్ దే తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 1.08 శాతం పడింది. ఎస్ అండ్ పీ 500 0.98 శాతం పెరిగింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.88 శాతం వృద్ధిచెందింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
{{/usCountry}}డీసీబీ బ్యాంక్- బై రూ. 186, స్టాప్ లాస్ రూ. 179, టార్గెట్ రూ. 200
జోటా హెల్త్‌కేర్- బై రూ. 1685, స్టాప్ లాస్ రూ. 1630, టార్గెట్ రూ. 1820
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్- బై రూ. 1608, స్టాప్ లాస్ రూ. 1590, టార్గెట్ రూ. 1645
కేఫిన్ టెక్నాలజీస్- బై రూ. 1063, స్టాప్ లాస్ రూ. 1035, టార్గెట్ రూ. 1115
ఎన్టీపీసీ- బై రూ. 328, స్టాప్ లాస్ రూ. 320, టార్గెట్ రూ. 345
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
హిందుస్థాన్ ఫుడ్స్ (ఎన్డీఏ): రూ.554, టార్గెట్ రూ.595, స్టాప్ లాస్ రూ.535;
అలికాన్ కాస్టల్లోయ్: రూ .897 వద్ద కొనండి, టార్గెట్ రూ .965, స్టాప్ లాస్ రూ .865;
ఈథర్ ఇండస్ట్రీస్: రూ .915 వద్ద కొనండి, టార్గెట్ రూ .985, స్టాప్ లాస్ రూ .885;
ఎథోస్: రూ .2901 వద్ద కొనండి, టార్గెట్ రూ .3131, స్టాప్ లాస్ రూ .2799;
అవంతి ఫీడ్స్: రూ .861 వద్ద కొనండి, లక్ష్యం రూ .925, స్టాప్ లాస్ రూ .835.