శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 14 పాయింట్లు పడి 85,707 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 13 పాయింట్లు కోల్పోయి 26,203 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 15 పాయింట్లు పెరిగి 59,753 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3,795.72 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,148.48 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
నవంబర్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 17,500.31 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 77,083.78 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 125 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 26,100- 26,000 లెవల్స్ వద్ద సపోర్ట్ ఉంది. 26,300 వద్ద రెసిస్టెన్స్ ఉంది. ఈ రేంజ్లో సూచీ కదలొచ్చు. 26,300 బ్రేక్ అయితే 26,600 వరకు వెళ్లొచ్చు,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్కి చెందిన టెక్నికల్ ఎనలిస్ట్ వాత్సల్ భవ తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.61 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.54శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.65 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్గా కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్గా కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
{{/usCountry}}లారస్ ల్యాబ్స్- బై రూ. 1031, స్టాప్ లాస్ రూ. 995, టార్గెట్ రూ. 1103
మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షిల్ సర్వీసెస్- బై రూ. 372, స్టాప్ లాస్ రూ. 359, టార్గెట్ రూ. 398
పిరమాల్ ఫార్మా- బై రూ. 188, స్టాప్ లాస్ రూ. 184, టార్గెట్ రూ. 200
ఆర్బీఎల్ బ్యాంక్- బై రూ. 313, స్టాప్ లాస్ రూ. 308, టార్గెట్ రూ. 325
ఆస్ట్రల్ లిమిటెడ్- బై రూ. 1445, స్టాప్ లాస్ రూ. 1430, టార్గెట్ రూ. 1500
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
అకుటాస్ కెమికల్స్: రూ .1837 వద్ద కొనండి, లక్ష్యం రూ .1985, స్టాప్ లాస్ రూ .1777;
సెనోరెస్ ఫార్మాస్యూటికల్స్: రూ .823 వద్ద కొనండి, లక్ష్యం రూ .888, స్టాప్ లాస్ రూ .795;
లాటెంట్ వ్యూ అనలిటిక్స్: రూ .498 వద్ద కొనండి, లక్ష్యం రూ .535, స్టాప్ లాస్ రూ .480;
జాగిల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్: రూ .392 వద్ద కొనండి, టార్గెట్ రూ .420, స్టాప్ లాస్ రూ .380;
డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్: రూ .533 వద్ద కొనండి, లక్ష్యం రూ .575, స్టాప్ లాస్ రూ .515.