...
...
Next Story

Flight tickets : పండుగలకు ఇంటికి వెళుతున్నారా? విమాన టికెట్​ రేట్లపై డిస్కౌంట్లు ఇలా..

పండుగలకు, ఇంటర్న్‌షిప్‌ల కోసం విమానాల్లో ప్రయాణించే విద్యార్థులకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అద్భుతమైన ఆఫర్‌ ప్రకటించింది. బేస్ ఫేర్‌పై 10 శాతం తగ్గింపుతో పాటు ఉచితంగా 10 కేజీల అదనపు లగేజ్, నామమాత్రపు ఛార్జీకే డేట్ ఛేంజ్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. పూర్తి వివరాలు..

Published on: Sep 25, 2026, 09:10:22 IST
Advertisement

పండుగ సెలవుల్లో ఇంటికి వెళ్లే విద్యార్థులకు, ఇంటర్న్‌షిప్‌లు, సెమిస్టర్ పరీక్షల కోసం ఇతర నగరాలకు ప్రయాణించే స్టూడెంట్స్​కి ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ శుభవార్త అందించింది. విద్యార్థుల ప్రయాణ భారాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రత్యేక విమాన ఛార్జీలను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫర్ ద్వారా తక్కువ ఖర్చుతో పాటు అదనపు లగేజీని తీసుకెళ్లే అవకాశాన్ని విమాన సంస్థ కల్పిస్తోంది.

విద్యార్థులకు లభించే ప్రత్యేక ప్రయోజనాలు ఇవే..

ఎయిర్​ ఇండియా ఎక్స్​ప్రెస్..
ఎయిర్​ ఇండియా ఎక్స్​ప్రెస్..

సాధారణంగా విమాన ప్రయాణాల్లో విద్యార్థులకు లగేజీ పరిమితి ఒక పెద్ద సవాలుగా మారుతుంది. పుస్తకాలు, బట్టలు, ఇతర వస్తువులు సర్దుకోవడానికి సాధారణ 15 కేజీల చెక్-ఇన్ లగేజ్ సరిపోక ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది.

10% డిస్కౌంట్: విమాన టికెట్ బేస్ ఫేర్‌పై నేరుగా 10 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది.

25 కేజీల చెక్-ఇన్ లగేజ్: సాధారణంగా ఎకానమీ క్లాస్‌లో 15 కేజీల లగేజ్‌కు మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ ఈ ఆఫర్ కింద విద్యార్థులు ఉచితంగా మరో 10 కేజీల అదనపు లగేజ్‌ను.. అంటే మొత్తం 25 కేజీల చెక్-ఇన్ లగేజ్‌ను ఉచితంగా తీసుకెళ్లవచ్చు.

రూ. 99కే డేట్ ఛేంజ్: ప్రయాణ తేదీలను మార్చుకోవాల్సి వస్తే కేవలం రూ. 99 నామమాత్రపు రుసుముతో తేదీని మార్చుకునే సదుపాయాన్ని అందిస్తున్నారు. (నిబంధనలు వర్తిస్తాయి).

అదనంగా 5 శాతం తగ్గింపు.. ‘వైబ్స్’ ప్రోమో కోడ్!

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా నేరుగా టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు మరో 5 శాతం అదనపు డిస్కౌంట్ లభిస్తుంది! దీని కోసం బుకింగ్ సమయంలో ‘VIBES’ అనే ప్రోమో కోడ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ దేశీయ, అంతర్జాతీయ సర్వీసులకు వర్తిస్తుంది.

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అందిస్తున్న ఈ ప్రత్యేక స్టూడెంట్ డిస్కౌంట్ పొందడానికి కొన్ని ముఖ్యమైన అర్హతలు ఉండాలి:

  • ప్రయాణించే విద్యార్థి వయస్సు కనీసం 12 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.
  • గుర్తింపు పొందిన విద్యాసంస్థ (స్కూల్, కాలేజీ లేదా యూనివర్సిటీ) జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ఐడీ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి.
  • ఐడీ కార్డుపై విద్యార్థి పేరు, పుట్టిన తేదీ స్పష్టంగా నమోదై ఉండాలి.
  • ఎయిర్‌పోర్ట్‌లో చెక్-ఇన్ అయ్యే సమయంలో ఈ స్టూడెంట్ ఐడీ కార్డును సిబ్బందికి చూపించాల్సి ఉంటుంది.

వీసా కార్డ్ వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్!

స్టూడెంట్ ఆఫర్‌తో పాటు వీసా డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు ఉపయోగించి బుకింగ్ చేసుకునే ప్రయాణికులకు కూడా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ మరో ఆఫర్ ప్రకటిస్తోంది. అధికారిక వెబ్‌సైట్‌లో లభించే ప్రోమో కోడ్ ఉపయోగించి వీసా కార్డులతో టికెట్ బుక్ చేసుకుంటే గరిష్టంగా రూ. 600 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ వీసా ఆఫర్ అక్టోబర్ 9, 2026 వరకు అందుబాటులో ఉంటుంది.

ఈ ప్రత్యేక ఆఫర్లు, నిబంధనలు, బుకింగ్‌ల కోసం ప్రయాణికులు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks