...
...
Next Story

Apple Back to School : యాపిల్ 'బ్యాక్​ టు స్కూల్' ఆఫర్​ వచ్చేసింది- మ్యాక్‌బుక్, ఐప్యాడ్‌లపై డిస్కౌంట్లు..

Apple Back to School offer 2026 : భారతీయ విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం యాపిల్ సంస్థ 'బ్యాక్ టు స్కూల్ 2026' ఆఫర్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో ఎంపిక చేసిన మ్యాక్‌బుక్, ఐప్యాడ్‌లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. వీటితో పాటు ఎయిర్‌పాడ్స్, యాపిల్ పెన్సిల్ ప్రొ వంటి యాక్సెసరీలను ఉచితంగా పొందవచ్చు.

Published on: Jul 17, 2026, 10:43:33 IST
Advertisement

కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన తరుణంలో విద్యార్థులకు, విద్యా రంగంలో ఉన్నవారికి యాపిల్ ఇండియా అదిరిపోయే వార్త చెప్పింది. ప్రతి ఏటా నిర్వహించే తమ పాపులర్ ‘బ్యాక్ టు స్కూల్ 2026’ ప్రమోషనల్ ఆఫర్‌ను అధికారికంగా ప్రారంభించింది. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు కొనాలనుకునే కాలేజీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అలాగే ఉపాధ్యాయులు ఈ ఆఫర్ ద్వారా భారీగా డబ్బు ఆదా చేసుకోవచ్చు.

యాపిల్ బ్యాక్ టు స్కూల్ ఆఫర్ల వివరాలు.. (Apple)
యాపిల్ బ్యాక్ టు స్కూల్ ఆఫర్ల వివరాలు.. (Apple)

ఈ ప్రత్యేక సేల్ ఆగస్టు 27, 2026 వరకు అందుబాటులో ఉంటుంది. యాపిల్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ స్టోర్ లేదా అధికారిక యాపిల్ రీటైల్ స్టోర్ల (యాపిల్ సాకేత్, బిజికెసి) ద్వారా ఈ ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు. ఇటీవల భారతదేశంలో మ్యాక్‌బుక్, ఐప్యాడ్ మోడళ్ల ధరలను ఆపిల్ స్వల్పంగా సవరించినప్పటికీ.. ఈ సేల్‌లో లభించే ఎడ్యుకేషన్ డిస్కౌంట్, ఉచిత యాక్సెసరీల బండిల్ ఆఫర్ ద్వారా ఆ పెరిగిన భారాన్ని కస్టమర్లు సులభంగా అధిగమించవచ్చు.

మ్యాక్‌బుక్ కొంటే ఎయిర్‌పాడ్స్ లేదా ఎయిర్‌ట్యాగ్ ఉచితం!

ఈ సేల్‌లో భాగంగా కస్టమర్లు అర్హత గల యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ లేదా మ్యాక్‌బుక్ ప్రో ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేస్తే.. సరికొత్త ఎయిర్‌పాడ్స్ 4 లేదా ఎయిర్‌ట్యాగ్ 4 ప్యాక్​ను ఉచితంగా ఎంచుకోవచ్చు.

ఒకవేళ ఈ బేస్ యాక్సెసరీలు కాకుండా మరింత ప్రీమియం మోడల్స్ కావాలనుకుంటే, కేవలం వ్యత్యాస ధరను చెల్లించి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు:

యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ఏఎన్​సీ) కలిగిన ఎయిర్‌పాడ్స్ 4 కావాలంటే అదనంగా రూ. 5,000 చెల్లించాలి.

ప్రీమియం ఎయిర్‌పాడ్స్ ప్రొ 3 కావాలనుకుంటే అదనంగా రూ. 13,000 చెల్లించాల్సి ఉంటుంది.

13-ఇంచ్ మ్యాక్‌బుక్ ఎయిర్ (ఎం5 చిప్): దీని సాధారణ మార్కెట్ ధర రూ. 1,49,900 కాగా, ఎడ్యుకేషన్ ఆఫర్ కింద విద్యార్థులకు రూ. 1,37,900 కే లభిస్తుంది.

14-ఇంచ్ మ్యాక్‌బుక్ ప్రో (ఎం5 చిప్): దీని ప్రారంభ ధర రూ. 2,39,900 కాగా, ఈ ఆఫర్‌లో రూ. 2,27,900 కే దక్కించుకోవచ్చు.

ఐప్యాడ్‌లపై ఉచిత యాపిల్ పెన్సిల్ ప్రొ!

టాబ్లెట్ ప్రియుల కోసం కూడా యాపిల్ క్రేజీ డీల్స్ తీసుకొచ్చింది. ఐప్యాడ్ ఎయిర్ లేదా ఐప్యాడ్ ప్రో కొనుగోలు చేసే అర్హులైన విద్యార్థులకు యాపిల్ పెన్సిల్ ప్రొను రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా అందిస్తున్నారు.

పెన్సిల్ వద్దు అనుకునే వారు ఇతర యాక్సెసరీలను కూడా ఎంచుకోవచ్చు:

ఎయిర్‌ట్యాగ్ 4 ప్యాక్ లేదా సాధారణ ఎయిర్‌పాడ్స్ 4 కోసం అదనంగా రూ. 2,000 చెల్లించాలి.

ఎయిర్‌పాడ్స్ 4 (ఏఎన్​సీ) మోడల్ కోసం అదనంగా రూ. 7,000 చెల్లించాలి.

ఈ ఐప్యాడ్ ఆఫర్ల ద్వారా వినియోగదారులు రూ. 10,900 వరకు ప్రయోజనం పొందుతారని ఆపిల్ పేర్కొంది.

ధరల వివరాలు (ఆఫర్ కింద):

11-ఇంచ్ ఐప్యాడ్ ఎయిర్ ఎం4 (128GB): దీని అసలు ధర రూ. 89,900 కాగా, ఆఫర్ ధర రూ. 83,900 గా ఉంది.

11-ఇంచ్ ఐప్యాడ్ ప్రో ఎం5 (256GB): దీని సాధారణ ధర రూ. 1,39,900 కాగా, ఎడ్యుకేషన్ స్టోర్‌లో రూ. 1,27,900 కే లభిస్తుంది.

ఆఫర్ వేటికి వర్తించదు?

యాపిల్ ఆన్‌లైన్ స్టోర్ లేదా యాప్ ద్వారా కొనుగోలు చేసే యాక్సెసరీలపై ఎప్పటిలాగే ఉచితంగా పేరు లేదా ఎమోజీలను చెక్కించుకునే సదుపాయాన్ని కంటిన్యూ చేసింది. అయితే, ఈ 'బ్యాక్ టు స్కూల్' ఉచిత యాక్సెసరీ ఆఫర్ కేవలం పైన పేర్కొన్న మోడళ్లకు మాత్రమే పరిమితం. మ్యాక్‌బుక్ నియో, ఐప్యాడ్ మినీ, స్టాండర్డ్ ఐప్యాడ్, యాపిల్ డెస్క్‌టాప్ మ్యాక్ శ్రేణికి ఈ ఉచిత యాక్సెసరీల ఆఫర్ వర్తించదు. వీటికి సాధారణ ఎడ్యుకేషన్ డిస్కౌంట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

అర్హతను ఎలా నిరూపించుకోవాలి?

ఈ ఆఫర్లను ఆన్‌లైన్‌లో పొందాలనుకునే విద్యార్థులు, ఉపాధ్యాయులు తాము విద్యార్థులమే అని ధృవీకరించుకోవడానికి 'UNiDAYS' వెబ్‌సైట్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ నేరుగా యాపిల్ రీటైల్ స్టోర్‌కు వెళ్లేవారైతే.. తమ కాలేజీ ఐడీ కార్డు లేదా అడ్మిషన్ లెటర్‌ను చూపిస్తే సరిపోతుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks