జపాన్​లో చదువుకు ప్లాన్​ చేస్తున్నారా? ఈ ప్రవేశ పరీక్షల గురించి తెలుసుకోండి..

జపాన్​లో చదువుకోవాలని ప్లాన్​ చేస్తున్నారా? జపాన్ యూనివర్సిటీల్లో అడ్మిషన్ పొందాలా? అయితే ఇది మీకోసమే! మీరు రాయాల్సిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

Published on: Dec 21, 2025, 05:43:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విద్యార్థులకు అత్యుత్తమ విద్యావకాశాలను అందించే దేశాల్లో జపాన్ ఒకటి. అక్కడి యూనివర్సిటీల్లో సీటు సాధించాలంటే, విద్యార్థులు కొన్ని ప్రత్యేక ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. మీరు ఎంచుకునే కోర్సు, యూనివర్సిటీని బట్టి ఈ పరీక్షలు మారుతుంటాయి. అందుకే అప్లై చేసేముందే ఆయా యూనివర్సిటీల నిబంధనలను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించడం ముఖ్యం.

జపాన్​లో చదువుకు ప్లాన్​ చేస్తున్నారా?
జపాన్​లో చదువుకు ప్లాన్​ చేస్తున్నారా?

జపాన్‌లోని విద్యాసంస్థల్లో చేరడానికి అవసరమయ్యే పరీక్షల వివరాలు..

1. ఈజేయూ (ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోసం జపాన్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష)

అండర్ గ్రాడ్యుయేట్ (డిగ్రీ) కోర్సుల్లో చేరాలనుకునే అంతర్జాతీయ విద్యార్థుల కోసం ఈజేయూ పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్షలో సైన్స్, 'జపాన్ అండ్ ది వరల్డ్', మ్యాథమెటిక్స్‌లో విద్యార్థికి ఉన్న ప్రాథమిక అవగాహనను పరీక్షిస్తారు. జపాన్‌లోని సుమారు 60 శాతానికి పైగా యూనివర్సిటీలు (సుమారు 479 సంస్థలు) అడ్మిషన్ల సమయంలో ఈజేయూ స్కోరును తప్పనిసరిగా అడుగుతాయి.

2. జపనీస్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (జేఎల్​పీటీ)

జపనీస్ మాతృభాష కాని వారు ఆ భాషలో ఎంతవరకు ప్రావీణ్యం కలిగి ఉన్నారో తెలుసుకోవడానికి ఈ జేఎల్​పీటీ నిర్వహిస్తారు. ఇందులో జపనీస్ అక్షరాలు, పదజాలం, వ్యాకరణంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పరీక్షిస్తారు.

లెవల్స్​: ఇందులో ఎన్​5 నుంచి ఎన్​1 వరకు మొత్తం 5 స్థాయిలు ఉంటాయి.

ఎన్​5 - ఎన్​4: ప్రాథమిక స్థాయి అవగాహనను సూచిస్తాయి.

ఎన్​1: ఇది అత్యున్నత స్థాయి. వార్తాపత్రికలు చదవగలిగే, క్లిష్టమైన ఉపన్యాసాలను అర్థం చేసుకోగలిగే వారికి ఇది వర్తిస్తుంది.

3. సెకండరీ ఎడ్యుకేషన్ అర్హతలు

మీ పాఠశాల విద్య (ఇంటర్మీడియట్/ప్లస్ 2) పూర్తి చేసినట్లు ఆధారంగా ఎస్​ఏటీ, ఏసీటీ, లేదా ఇంటర్నేషనల్ బాకలారియేట్ (ఐబీ) పరీక్షల స్కోర్లను కూడా కొన్ని యూనివర్సిటీలు అడుగుతాయి.

  • ఐఐఎం బెంగళూరులో పర్సనల్​ ఫైనాన్స్​ కోర్సు.. సర్టిఫికేట్​ పొందితే అనేక ప్రయోజనాలు! పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

4. యూనిఫైడ్/కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్

సాధారణంగా ఈ పరీక్షను జపాన్ విద్యార్థులు రాస్తారు. చాలా యూనివర్సిటీలు అంతర్జాతీయ విద్యార్థులకు దీని నుంచి మినహాయింపు ఇస్తాయి. అయితే, మెడికల్ (వైద్యం), డెంటల్ వంటి కొన్ని ప్రత్యేక కోర్సుల్లో చేరాలనుకునే వారు మాత్రం ఈ పరీక్ష రాయాల్సి రావచ్చు.

5. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రూఫ్

జపాన్ యూనివర్సిటీలు అభ్యర్థి ఇంగ్లీష్ నైపుణ్యాన్ని కూడా గమనిస్తాయి. ఇందుకోసం TOEFL, IELTS, TOEIC, లేదా Eiken వంటి పరీక్షల స్కోరును సమర్పించాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసే ముందే ఏ యూనివర్సిటీ ఏ స్కోరును అడుగుతుందో సరిచూసుకోవడం మంచిది.

జపాన్‌లో చదువుకోవాలనే కల నిజం చేసుకోవాలంటే ఈ పరీక్షల ప్రిపరేషన్ చాలా కీలకం. మీ లక్ష్యానికి తగిన యూనివర్సిటీ గైడ్‌లైన్స్‌ను ఇప్పుడే పరిశీలించి, పరీక్షలకు సిద్ధమవ్వండి!

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More