...
...
Next Story

IND vs PAK: కొలంబోలో సూర్యుడొచ్చాడు-తొలగని వర్షం ముప్పు-కాసేపట్లో టీ20 ప్రపంచకప్ లో ఇండియా వర్సెస్ పాక్-లైవ్ స్ట్రీమింగ్

ఇండియా వర్సెస్ పాకిస్థాన్ హై వోల్టేజీ పోరును చూసేందుకు క్రికెట్ ప్రపంచం వెయిట్ చేస్తోంది. అయితే ఈ రోజు టీ20 ప్రపంచకప్ లో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించే అవకాశముంది. కొలంబోలో సూర్యుడొచ్చినా ముప్పు పూర్తిగా తప్పలేదు. పాక్ ఆటగాళ్లకు ఇండియన్ ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇవ్వరని తెలిసింది.

Published on: Feb 15, 2026, 16:54:28 IST
Advertisement

ఇండియా వర్సెస్ పాకిస్థాన్ పోరు కోసం క్రికెట్ ప్రపంచమంతా వెయిట్ చేస్తోంది. కానీ వరుణుడు మాత్రం బిగ్ షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. ఆదివారం (ఫిబ్రవరి 15) టీ20 ప్రపంచకప్ లో భాగంగా కొలంబోలో జరగాల్సిన ఇండియా వర్సెస్ పాక్ పోరుకు వర్షం అంతరాయం కలిగించే అవకాశముంది. పొద్దున నుంచి మబ్బులు పట్టి ఉన్న కొలంబోలో సూర్యుడు వచ్చాడు. కానీ వర్షం ముప్పు మాత్రం తొలగిపోలేదు.

ఇండియా వర్సెస్ పాకిస్థాన్

పాకిస్థాన్, ఇండియా టీమ్ కెప్టెన్లు (AFP)
పాకిస్థాన్, ఇండియా టీమ్ కెప్టెన్లు (AFP)

టీ20 ప్రపంచకప్ లో చాలా నాటకీయ పరిణామాల తర్వాత ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరగబోతోంది. మొదట ఈ మ్యాచ్ ను బాయ్ కాట్ చేస్తామని ప్రకటించిన పాకిస్థాన్ ఆ తర్వాత తోక ముడిచింది. అయితే ఈ రోజు జరగాల్సిన మ్యాచ్ కు వర్షం ముప్పు ఉంది. ఇప్పుడు కొలంబోలో సూర్యుడు వచ్చాడు. కానీ మ్యాచ్ సమయానికి వర్షం కురిసే అవకాశం 8 శాతం ఉందని ఆక్యూవెదర్ తెలిపింది. అలాగే మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా వర్షం వల్ల అంతరాయం కలగొచ్చని సమాచారం.

లైవ్ స్ట్రీమింగ్

ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ రాత్రి 7 గంటలకు కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో ప్రారంభమవుతుంది. సాయంత్రం 6.30 గంటలకు టాస్ వేస్తారు. టీ20 ప్రపంచకప్ లో భాగంగా గ్రూప్-ఎ లోని ఇండియా, పాకిస్థాన్ టీమ్స్ మధ్య ఈ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం జరగాల్సి ఉంది. ఈ హై వోల్టేజీ పోరును స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ లో చూడొచ్చు. ఓటీటీలో అయితే జియోహాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ చేయొచ్చు.

నో షేక్ హ్యాండ్

ఇండియా వర్సెస్ పాకిస్థాన్ పోరును స్టేడియంలో చూసేందుకు ఫ్యాన్స్ మాత్రమే కాదు సెలబ్రిటీలు ఎగబడతారు. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూసేందుకు కొలంబో చేరుకున్నాడు. ఇతర దిగ్గజ ఆటగాళ్లు, సెలబ్రిటీలు కూడా ఈ పోరుకు చూసేందుకు తరలివస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks