IND vs Pak : మొన్నటి వరకు బాయ్‌కాట్- ఇప్పుడు ఇది.. ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ జరగడం డౌటే!
ఫిబ్రవరి 15న ఇండియా వర్సెస్ పాకిస్థాన్ టీ20 మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి షాక్ తగిలేలా కనిపిస్తోంది! కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో, మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశం దాదాపు 50శాతం ఉండటం ఇందుకు కారణం.
టి20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 15) కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరగనున్న భారత్ - పాకిస్థాన్ హై-ప్రొఫైల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది! శ్రీలంక వాతావరణ శాఖ, వివిధ వాతావరణ నివేదికల ప్రకారం ఆదివారం అక్కడ వర్షం పడే అవకాశం ఉంది.

ఇండియా వర్సెస్ పాకిస్థాన్- కొలంబో వాతావరణ అంచనా (ఆదివారం, ఫిబ్రవరి 15):
శ్రీలంక వాతావరణ శాఖ, తాజా నివేదికల ప్రకారం:
పగటి సమయం: వర్షం కురిసే అవకాశం 65% వరకు ఉంది. ఆకాశం మేఘావృతమై ఉండి, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.
మ్యాచ్ సమయం (రాత్రి): వర్షం పడే అవకాశం 25% నుంచి 49% వరకు ఉండవచ్చని అంచనా. అయితే, రాత్రి 7 గంటల సమయంలో చినుకులు పడే అవకాశం ఎక్కువగా ఉందని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి.
పరిస్థితులు: వాతావరణం చాలా తేమగా ఉంటుంది. ఉత్తరం నుంచి గంటకు 11 మైళ్ల వేగంతో గాలులు వీస్తాయి.
ఇండియా వర్సెస్ పాకిస్థాన్- మ్యాచ్ రద్దయితే ఏమవుతుంది?
కనీస ఓవర్లు: టీ20 మ్యాచ్ ఫలితం తేలాలంటే ఇరు జట్లు కనీసం 5 ఓవర్ల పాటు ఆడాలి.
పాయింట్ల పంపకం: ఒకవేళ వర్షం వల్ల ఒక్క బంతి కూడా పడకుండా మ్యాచ్ రద్దయితే, గ్రూప్ స్టేజ్ మ్యాచ్ కాబట్టి దీనికి ‘రిజర్వ్ డే’ కూడా లేదు. ఫలితంగా భారత్, పాకిస్థాన్‌లకు చెరో ఒక పాయింట్ లభిస్తుంది.
ఆర్థిక నష్టం: ఇదే అత్యంత ఆందోళనకర విషయం! టీ20 ప్రపంచకప్ 2026లో ఈ ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ రద్దయితే బ్రాడ్‌కాస్టర్ జియోస్టార్ సుమారు రూ. 200 - రూ. 250 కోట్ల ప్రకటనల ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. 10 సెకన్ల యాడ్ స్పాట్ ధర దాదాపు రూ. 17 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు పలుకుతోంది.
మొన్నటి వరకు 'బాయ్‌కాట్'- ఇప్పుడు వర్షం!
భారత్, పాకిస్థాన్ జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం ఎప్పుడో మానేశాయి. ఫలితంగా ఐసీసీ టోర్నమెంట్లలోనే ఫ్యాన్స్ ఈ మ్యాచ్‌లను చూడగలుగుతున్నారు. కానీ 2026 టీ20 ప్రపంచకప్‌లో ఇండియాతో మ్యాచ్ ఆడమని పాక్ కొన్ని రోజుల క్రితం ప్రకటించి, అందరికి షాక్ ఇచ్చింది. కానీ ఐసీసీ జోక్యం చేసుకుని, బుజ్జగించడంతో పాక్ యూ-టర్న్ కొట్టి, ఇండియాతో ఫిబ్రవరి 15న ఆడతామని చెప్పింది. ఇది ఫ్యాన్స్‌కి మంచి జోష్ని ఇచ్చింది.
ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు వరుణుడి వల్ల మ్యాచ్ ఆగిపోయే ప్రమాదం ఉందని తెలిసి ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు.
ప్రశ్నలు- సమాధానాలు:-
ప్రశ్న- పాకిస్థాన్ జట్టు ఈ మ్యాచ్ ఆడుతుందా?
సమాధానం- అవును. మొదట భారత్‌తో ఆడబోమని మొండికేసినప్పటికీ, ఐసీసీ అధికారుల చర్చల తర్వాత పాక్ ప్రభుత్వం తమ జట్టును ఆడేందుకు అనుమతించింది. ప్రస్తుతం పాక్ జట్టు కొలంబోలోనే ఉంది.
ప్రశ్న- భారత్- పాకిస్థాన్ జట్ల ప్రస్తుత పరిస్థితి ఏంటి?
సమాధానం- భారత్ తన మొదటి రెండు మ్యాచ్‌ల్లో (అమెరికా, నమీబియాపై) గెలిచి పటిష్టంగా ఉంది. పాకిస్థాన్ కూడా నెదర్లాండ్స్, అమెరికాపై గెలిచి ఫామ్‌లో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్-ఏలో అగ్రస్థానానికి చేరుకుంటుంది.
ప్రశ్న- ఆర్ ప్రేమదాస స్టేడియం డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉంటుంది?
సమాధానం- ప్రేమదాస స్టేడియంలో వర్షం ఆగిపోయిన 20 నిమిషాల్లోనే ఆటను పునఃప్రారంభించే అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


