Supreme Court recruitment : సుప్రీంకోర్టులో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ పోస్టులు- వేతనం, అర్హత వివరాలు..

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో 250 జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏదేనీ డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ టైపింగ్ నైపుణ్యం ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 7 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Oct 2, 2026, 09:10:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఉద్యోగం సాధించాలనుకునే అభ్యర్థులకు మంచి అవకాశం. సుప్రీంకోర్టులో 250 జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ (జేసీఏ) తాత్కాలిక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎంపికైన అభ్యర్థులకు పే మ్యాట్రిక్స్ లెవెల్-6 ప్రకారం నెలకు రూ.35,400 ప్రాథమిక వేతనంతో పాటు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు లభిస్తాయి.

సుప్రీంకోర్టు రిక్రూట్​మెంట్​ 2026 వివరాలు..
సుప్రీంకోర్టు రిక్రూట్​మెంట్​ 2026 వివరాలు..

సుప్రీంకోర్టు రిక్రూట్​మెంట్​ 2026- విద్యార్హతలు, వయోపరిమితి..

సుప్రీంకోర్టు రిక్రూట్​మెంట్​ 2026లో భాగంగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు నిమిషానికి కనీసం 35 పదాల ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ ఉండాలి.

అభ్యర్థుల వయస్సు 2026 సెప్టెంబర్ 1 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ (నాన్-క్రీమీలేయర్), దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు గరిష్టంగా ఐదేళ్ల వరకు అదనపు వయో సడలింపు వర్తిస్తుంది.

సుప్రీంకోర్టు రిక్రూట్​మెంట్​ 2026- నాలుగు దశల ఎంపిక ప్రక్రియ..

సుప్రీంకోర్టు రిక్రూట్​మెంట్​ 2026 ప్రక్రియ నాలుగు దశల్లో పారదర్శకంగా సాగుతుంది.

అబ్జెక్టివ్ టైప్ పరీక్ష: 100 మార్కులకు 90 నిమిషాల వ్యవధిలో ఈ పరీక్ష ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్, భారత రాజ్యాంగంలోని న్యాయపరమైన అంశాలు, సుప్రీంకోర్టు రూల్స్ 2013, సుప్రీంకోర్టు ఆఫీసర్స్ అండ్ సర్వెంట్స్ సర్వీస్ రూల్స్ 1961, కంప్యూటర్ పరిజ్ఞానంపై ప్రశ్నలు ఇస్తారు. దరఖాస్తుదారులు ఇందులో కనీసం 50 మార్కులు సాధించాలి.

టైపింగ్ టెస్ట్: కంప్యూటర్‌పై 10 నిమిషాల పాటు ఇంగ్లీష్ టైపింగ్ పరీక్ష నిర్వహిస్తారు. నిమిషానికి కనీసం 35 పదాల వేగం ఉండాలి. 50 మార్కులకు గాను కనీసం 25 మార్కులు రావాలి.

డిస్క్రిప్టివ్ రాత పరీక్ష: ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, ప్రెసిస్ రైటింగ్, ఎస్సే రైటింగ్ అంశాలపై 100 మార్కులకు రెండు గంటల పాటు రాత పరీక్ష ఉంటుంది. ఇందులో కనీసం 50 మార్కులు సాధించాలి.

ఇంటర్వ్యూ: చివరి దశలో 25 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించడానికి కనీసం 13 మార్కులు పొందాల్సి ఉంటుంది.

సుప్రీంకోర్టు రిక్రూట్​మెంట్​ 2026- దరఖాస్తు రుసుము, ఆన్‌లైన్ తేదీలు

జనరల్, అన్​రిజర్వ్‌డ్ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.1,500 కాగా.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ (నాన్-క్రీమీలేయర్), మాజీ సైనికోద్యోగులు, దివ్యాంగ అభ్యర్థులకు రూ.750గా నిర్ణయించారు. బ్యాంక్ ఛార్జీలు అదనంగా వర్తిస్తాయి. యూకో బ్యాంక్ పేమెంట్ గేట్‌వే ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలి. ఒకసారి చెల్లించిన రుసుమును ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఇవ్వరు.

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ 2026 అక్టోబర్ 7 నుంచి ప్రారంభమవుతుంది. అర్హత ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 20వ తేదీ రాత్రి 11:55 గంటల వరకు దరఖాస్తు సమర్పించవచ్చు. సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్ www.sci.gov.in ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. తపాలా లేదా ఇతర మార్గాల్లో పంపే దరఖాస్తులను పరిశీలించరు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More