భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పనితీరుపై లేవనెత్తిన తీవ్ర ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ ఇతర ఎన్నికల కమిషనర్ల అంగీకారం లేకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ దాఖలైన పిటిషన్‌ను వచ్చే వారం విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం మంగళవారం సమ్మతించింది.
సుప్రీంకోర్టులో సీనియర్ లాయర్ వాదనలు

భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఎదుట సీనియర్ అడ్వకేట్ వికాస్ సింగ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాలు ఏకగ్రీవంగా లేదా మెజారిటీ అభిప్రాయంతో ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
"ఎన్నికల కమిషన్ పనిచేస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. ఒకవేళ ఈసీఐ ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకోకపోతే, అది చాలా తీవ్రమైన రాజ్యాంగ సమస్య" అని వికాస్ సింగ్ ధర్మాసనానికి వివరించారు.
పిటిషన్‌లో అసలు ఆరోపణలేంటి?
సామాజిక కార్యకర్త రాకేష్ కుమార్ సింగ్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో ప్రధానంగా ఇటీవలి ఒక ఆంగ్ల దినపత్రిక (ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్) ప్రచురించిన కథనాన్ని ప్రస్తావించారు. గడిచిన 10 నెలల్లో ఓటర్ల జాబితా సవరణలు, చేర్పులు, తొలగింపులు, పునరుద్ధరణ, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మార్పులకు సంబంధించి ఈసీఐ తీసుకున్న పలు నిర్ణయాలపై ఇతర ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి కనీసం 14 సార్లు అధికారికంగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఆ కథనం వెల్లడించింది.
ఎస్‌ఐటీ విచారణకు డిమాండ్
ఈ బయటపడిన వివరాల దృష్ట్యా గత ఏడాది అక్టోబర్ నుంచి ఈసీఐ తీసుకున్న అన్ని నిర్ణయాలు, ఫైళ్లు, నోటింగ్స్‌కు సంబంధించిన పూర్తి రికార్డులను సమర్పించేలా ఆదేశించాలని పిటిషనర్ కోరారు. ప్రాథమిక విచారణలో ఆరోపణలు నిజమని తేలితే, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిటీని లేదా ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కేసు తుది విచారణ ముగిసే వరకు జ్ఞానేష్ కుమార్ సీఈసీ బాధ్యతల నుంచి తప్పుకునేలా ఆదేశించాలని, కమిషన్ రోజువారీ వ్యవహారాలను మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఏకగ్రీవ నిర్ణయంతో నిర్వహించేలా తగిన ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ కోర్టును అభ్యర్థించారు.
రాజ్యాంగ నిబంధనలు ఏం చెప్తున్నాయి?
{{/usCountry}}ఈ కేసు తుది విచారణ ముగిసే వరకు జ్ఞానేష్ కుమార్ సీఈసీ బాధ్యతల నుంచి తప్పుకునేలా ఆదేశించాలని, కమిషన్ రోజువారీ వ్యవహారాలను మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఏకగ్రీవ నిర్ణయంతో నిర్వహించేలా తగిన ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ కోర్టును అభ్యర్థించారు.
రాజ్యాంగ నిబంధనలు ఏం చెప్తున్నాయి?
{{/usCountry}}బహుళ సభ్యుల రాజ్యాంగ వ్యవస్థగా ఉన్న ఎన్నికల సంఘం నిర్ణయాలు ఉమ్మడిగా ఉండాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 స్పష్టం చేస్తోందని పిటిషన్ పేర్కొంది. అంతేకాకుండా, ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల చట్టం 2023లోని సెక్షన్ 18 ప్రకారం... కమిషనర్ల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే మెజారిటీ సభ్యుల అభిప్రాయమే చెల్లుబాటు కావాలి.
"రాజ్యాంగబద్ధంగా బహుళ సభ్యుల కమిషన్‌కు సంక్రమించిన అధికారాలను చట్టబద్ధమైన భాగస్వామ్యం లేకుండా ఒక్కరే చెలాయిస్తే... ఓటర్ల జాబితాను నిర్ధారించే కీలక నిర్ణయాలు రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నాయా లేదా అనే సంచలన ప్రశ్న తలెత్తుతుంది" అని పిటిషన్‌లో పేర్కొన్నారు.