...
...
Next Story

Tamil Nadu Elections 2026: టీవీకే పార్టీ అభ్యర్థులు ఖరారు - 2 స్థానాల నుంచి పోటీ చేయనున్న విజయ్

Tamil Nadu Assembly Elections 2026 : టీవీకే పార్టీ అభ్యర్థులను విజయ్ ప్రకటించారు. 234 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా… విజయ్ రెండు స్థానాల్లో పోటీ చేయనున్నారు.

Published on: Mar 29, 2026, 13:05:51 IST
Advertisement

తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం సిద్ధమవుతున్న టీవీకే పార్టీ… తాజాగా 234 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఈ వివరాలను ఆ పార్టీ అధినేత విజయ్ వెల్లడించారు.

2 చోట్ల నుంచి విజయ్ పోటీ…

టీవీకే పార్టీ అభ్యర్థులను ప్రకటించిన విజయ్ (ఫైల్ ఫొటో)
టీవీకే పార్టీ అభ్యర్థులను ప్రకటించిన విజయ్ (ఫైల్ ఫొటో)

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. పెరంబూర్‌, తిరుచ్చి ఈస్ట్‌ నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు.చెన్నైలో ఆదివారం జరిగిన సభలో విజయ్‌… ఈ జాబితాను విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో తమకు, డీంకే మధ్యే అసలైన పోటీ ఉందని వ్యాఖ్యానించారు.

పెరంబూర్ నియోజకవర్గం నుంచి డీఎంకే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్డీ శేఖర్ పై విజయ్ పోటీ చేయనున్నారు. తిరుచ్చి ఈస్ట్ లో చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే, డీఎంకే అభ్యర్థి ఇనిగో ఇరుదయరాజ్ పై బరిలో ఉంటారు.

ఒక్క అవకాశం ఇవ్వండి - విజయ్

ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ…. విశ్వాసంతో, నిజాయితీగా, ప్రజాసేవకు అంకితభావంతో ఉంటామని చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మహిళల భద్రతతో పాటు మాదకద్రవ్య రహిత తమిళనాడుకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.

“ మా 'విజిల్' చిహ్నానికి ఓటు వేయాలని నేను ప్రజలను కోరుతున్నాను. మేము ఇక్కడ ప్రజల కోసం మాత్రమే ఉన్నాము. ఎల్లప్పుడూ ప్రజల కోసం ఉంటాం. గెలిచిన తర్వాత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయబోం. అవినీతికి పాల్పడబోమని హామీ ఇస్తున్నాను. మహిళల భద్రతకు భరోసా ఇస్తాం, మాదకద్రవ్య రహిత తమిళనాడును సృష్టిస్తాం. కఠినమైన శాంతిభద్రతలను పాటిస్తాం. నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోము. ఇదే నా వాగ్దానం. తమిళనాడు సంక్షేమం కోసం టీవీకేకు ఒక్క అవకాశం ఇవ్వండి” అని విజయ్ కోరారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe