విశాఖ సీఐఐ సమ్మిట్ మీద తమిళనాడులో పొలిటికల్ వార్ నడుస్తోంది. తమిళనాడుకు రావాల్సిన భారీ పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లీక్ చేశారనే ఆరోపణలతో 15 మంది ఉద్యోగులను విధుల నుండి తొలగించారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టుబడుల ఆకర్షణపై సలహాలు ఇచ్చే ప్రధాన సంస్థ గైడెన్స్ తమిళనాడులో పనిచేస్తున్న 15 మంది కాంట్రాక్టు ఉద్యోగులపై ఈ మేరకు వేటు పడింది.
రాజకీయ దుమారం మధ్యే కీలక చర్య

ఇటీవలి కాలంలో తమిళనాడుకు రావాల్సిన అనేక ప్రతిష్టాత్మక పరిశ్రమలు, పెట్టుబడులు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతున్నాయని తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను అధికార టీవీకే ఖండిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే, రాష్ట్ర పెట్టుబడుల రహస్యాలను ఏపీకి చేరవేస్తున్నారనే కారణంతో 15 మంది సిబ్బందిని తొలగించడం తమిళనాడు రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో కలకలం రేపుతోంది.
అసలు లోపం ఎక్కడ?
తొలగించిన 15 మంది సిబ్బంది కూడా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారేనని తెలిసింది. గతంలో వీరిని విధుల్లోకి తీసుకునే సమయంలో, ప్రభుత్వ వ్యాపార లేదా పెట్టుబడుల రహస్యాలను బయటకు చెప్పకూడదనే నిబంధన (Non-Disclosure Agreement - NDA) లేదా కాపీరైట్ ఒప్పందాలను సరిగ్గా కుదుర్చుకోలేదని సమాచారం. ఎలాంటి కఠినమైన రహస్య ఒప్పందాలు లేకుండానే పలువురిని కీలక బాధ్యతల్లో నియమించడమే ఈ సమాచార లీక్‌కు కారణమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఉద్యోగం పోయిన వెంటనే ఏపీ ప్రభుత్వంలో చేరిక!
ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. తమిళనాడులో ఉద్యోగాల నుండి తొలగించిన 15 మందిలో క్రిస్టో లారెల్, ప్రభాకరన్ అండి, ప్రీజా ప్రసాద్ అనే ముగ్గురు వ్యక్తులు, ఆ వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలిలో చేరారని తమిళనాడు మీడియా పేర్కొంటోంది. ఏపీ ప్రభుత్వ విభాగంలో విధుల్లో చేరిన విషయాన్ని వారే స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారని తెలిపింది.
కీలక పరిణామాలు
తమిళనాడు పెట్టుబడుల విభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తులు, ఉద్యోగం నుండి తొలగించిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విభాగంలో ఎలా చేరారనే దానిపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. తమిళనాడు ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పుడే వీరు ఏపీ ప్రభుత్వ అధికారులతో రహస్యంగా సంప్రదింపులు జరిపారా? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
{{/usCountry}}తమిళనాడు పెట్టుబడుల విభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తులు, ఉద్యోగం నుండి తొలగించిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విభాగంలో ఎలా చేరారనే దానిపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. తమిళనాడు ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పుడే వీరు ఏపీ ప్రభుత్వ అధికారులతో రహస్యంగా సంప్రదింపులు జరిపారా? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
{{/usCountry}}తమిళనాడుకు రాబోయే పెట్టుబడిదారుల వివరాలు, రహస్య సమాచారం వీరి వద్ద ఉండటం వల్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరిని వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకుందనే చర్చ జరుగుతోంది. మొత్తానికి రెండు పొరుగు రాష్ట్రాల మధ్య పెట్టుబడుల పోటీ తీవ్రంగా ఉన్న వేళ, ఈ సమాచార లీకేజీ వ్యవహారం పెను దుమారానికి దారితీస్తోంది.
తమిళనాడులో ఏర్పాటు అవుతాయనుకున్న దక్షిణ కొరియాకు చెందిన 2 పరిశ్రమలు.. 1400 కోట్ల రూపాయల పెట్టుబడులతో అనంతపురంలో ఏర్పాటుకు ఏపీలో ఒప్పందం కుదరడం కూడా చర్చనీయాంశమైంది. సీఎం విజయ్, డీఎంకే అధినేత స్టాలిన్ మధ్య దీనిపై పొలిటికల్ వార్ నడుస్తోంది.