భారత ఆటోమొబైల్ రంగాన్ని శాసిస్తున్న టాటా మోటార్స్.. సబ్-4 మీటర్ సెడాన్ విభాగంలో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు అలరించిన టిగోర్ సెడాన్‌ను సరికొత్త రూపురేఖలతో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ‘టాటా ఏరిస్’ పేరుతో భారత్‌లో అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త కారు ప్రారంభ ధరను రూ. 5.29 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించగా, టాప్ వేరియంట్ ధర రూ. 9.19 లక్షల వరకు ఉంటుంది.

ఈ రోజు నుంచే ఈ టాటా ఏరిస్ బుకింగ్‌లు ప్రారంభం కాగా, పండుగ సీజన్‌ను పురస్కరించుకుని నవరాత్రి మొదటి రోజు నుంచే కస్టమర్లకు డెలివరీలు అందించనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఏరిస్ మోడల్ స్మార్ట్, ప్యూర్, ప్యూర్+, క్రియేటివ్, అకంప్లిష్డ్ అనే 5 విభిన్న వేరియంట్లలో లభించనుంది.
టాటా నెక్ట్స్-జెన్ ‘ఎక్స్-ఆల్ఫా’ ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకున్న ఈ టాటా టిగోర్ ఫేస్‌లిఫ్ట్‌ని కేవలం వ్యక్తిగత ఉపయోగం కోసం మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. కమర్షియల్/ట్యాక్సీ రంగానికి మాత్రం పాత టిగోర్ ఎక్స్‌ప్రెస్ మోడల్ కొనసాగుతుందని టాటా ప్రకటించింది. మార్కెట్‌లో ఇది మారుతీ సుజుకీ డిజైర్, హోండా అమేజ్ వంటి దిగ్గజ కార్లతో నేరుగా పోటీపడనుంది.
ఈ నేపథ్యంలో ఈ టాటా ఏరిస్కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..
టాటా ఏరిస్ ఎక్స్టీరియర్..
పాత టిగోర్‌తో పోలిస్తే ఏరిస్ మోడల్ ముందు, వెనుక భాగాల డిజైన్లలో అద్భుతమైన మార్పులు చేశారు.
ఫ్రంట్ లుక్: హ్యాచ్‌బ్యాక్ మోడల్ టియాగో తరహాలో సరికొత్త ఫ్రంట్ గ్రిల్, కొత్త డిజైన్ కలిగిన హెడ్‌లాంప్స్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఫాగ్ లాంప్స్‌తో కారుకు ప్రీమియం లుక్ ఇచ్చారు.
రియర్ డిజైన్: వెనుక వైపు కనెక్టెడ్ లైట్ స్ట్రిప్, రీ-డిజైన్ చేసిన ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్‌తో పాటు సరికొత్త బ్లాక్-అవుట్ అలాయ్ వీల్స్‌ను అందించారు.
{{/usCountry}}రియర్ డిజైన్: వెనుక వైపు కనెక్టెడ్ లైట్ స్ట్రిప్, రీ-డిజైన్ చేసిన ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్‌తో పాటు సరికొత్త బ్లాక్-అవుట్ అలాయ్ వీల్స్‌ను అందించారు.
{{/usCountry}}కలర్స్ అండ్ డైమెన్షన్స్: కారు గ్రౌండ్ క్లియరెన్స్ 170 ఎంఎంగా ఉండటంతో భారతీయ రోడ్లు, గుంతలను నడిపేటప్పుడు సౌకర్యవంతంగా ఉంటుంది. డాండెల్ డ్రిజిల్, నైట్రో క్రిమ్సన్, డ్యూన్ గ్లో, డేటోనా గ్రే, ప్యూర్ గ్రే, ప్రిస్టైన్ వైట్ అనే 6 ఆకర్షణీయమైన రంగుల్లో ఈ టాటా ఏరిస్ లభిస్తుంది.
టాటా ఏరిస్ ఇంటీరియర్, ఫీచర్లు..
ఏరిస్ క్యాబిన్ లోపల అడుగుపెడితే ఎంతో విలాసవంతమైన అనుభూతి కలుగుతుంది. లైట్ బీజ్, గ్రే రంగుల కాంబినేషన్‌తో ఫ్యాబ్రిక్ తరహా డాష్‌బోర్డ్‌ను అమర్చారు.
ఇన్ఫోటైన్‌మెంట్: 10.25-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
కంఫర్ట్ ఫీచర్లు: సెగ్మెంట్‌లోనే మొదటిసారిగా వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయల్ స్మార్ట్‌ఫోన్ వైర్‌లెస్ ఛార్జింగ్, 360-డిగ్రీ కెమెరా, ఇన్-బిల్ట్ డాష్‌క్యామ్ రికార్డింగ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్, 65డబ్ల్యూ టైప్-సీ ఛార్జింగ్ పోర్టులను ఏర్పాటు చేశారు.
టాటా టిగోర్ ఫేస్‌లిఫ్ట్ ఏఎంటీ మోడళ్లలో రోటరీ డైయిల్ గేర్ సెలెక్టర్, ప్యాడిల్ షిఫ్టర్లు కూడా లభిస్తాయి. సీఎన్జీ ప్యాక్‌తో కూడిన వేరియంట్‌లో 70 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది.
టాటా ఏరిస్ ఇంజిన్, పర్ఫార్మెన్స్..
టాటా ఏరిస్‌లో విశ్వసనీయమైన 1.2-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను ఇచ్చారు.
పవర్ ఆటోమేటిక్: పెట్రోల్ మోడ్‌లో ఈ ఇంజిన్ 86 బీహెచ్పీ పవర్, 113 ఎన్ఎం టాప్‌ను ఉత్పత్తి చేస్తుంది. సీఎన్‌జీ మోడ్‌లో 75 బీహెచ్పీ పవర్, 96.5 ఎన్ఎం టాక్ ఇస్తుంది.
ట్విన్ సిలిండర్ టెక్నాలజీ: టాటాకు చెందిన పేటెంట్ ట్విన్-సిలిండర్ సీఎన్జీ సాంకేతికత వల్ల బూట్ స్పేస్ కోల్పోకుండానే మంచి మైలేజ్ సాధించవచ్చు. డైరక్ట్ సీఎన్జీ స్టార్ట్ సదుపాయం కూడా ఈ టాటా ఏరిస్‌లో ఉంది.
గేర్‌బాక్స్ ఎంపికలు: 5-స్పీడ్ మాన్యువల్‌తో పాటు, అత్యంత సౌకర్యవంతమైన 5-స్పీడ్ ఏఎంటీ (సీఎన్జీ-ఏఎంట కాంబినేషన్) ఆటోమేటిక్ వేరియంట్‌లోనూ కారు లభ్యమవుతోంది.
టాటా ఏరిస్ భద్రతకు ప్రాధాన్యం!
ఎప్పటిలాగే భద్రతకు టాటా అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా వస్తాయి. వీటితో పాటు బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, బ్రేకింగ్ ద్వారా టార్క్ వెక్టరింగ్, రోల్-ఓవర్ మిటిగేషన్, హిల్ హోల్డ్ కంట్రోల్, కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్, క్రాష్ తర్వాత తక్షణ ఎస్ఓఎస్ సపోర్ట్ వంటి అత్యుత్తమ భద్రతా ఫీచర్లను ఇందులో పొందుపరిచారు.
తక్కువ ధరలో లగ్జరీ ఫీచర్లు, అగ్రశ్రేణి భద్రత కోరుకునే కుటుంబాలకు టాటా ఏరిస్ ఒక బెస్ట్ ఆప్షన్‌గా నిలవనుంది.