...
...
Next Story

టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లాభాల్లో 38% వృద్ధి.. ఉప్పు, పప్పు, టీ బిజినెస్ భేష్

Tata Consumer Q3 Results: టాటా గ్రూప్‌నకు చెందిన ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ మూడో త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. గతేడాదితో పోలిస్తే కంపెనీ నికర లాభం ఏకంగా 38% పెరిగి రూ. 385 కోట్లకు చేరింది. ఉప్పు, టీ, పప్పుల విభాగాల్లో బలమైన వృద్ధి నమోదు కావడం కంపెనీకి కలిసొచ్చింది.

Published on: Jan 27, 2026, 13:43:57 IST
Advertisement

దేశీయ ఎఫ్‌ఎంసీజీ (FMCG) రంగంలో అగ్రగామిగా ఉన్న టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ (Tata Consumer Products) తన వాటాదారులకు శుభవార్త అందించింది. 2026 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి (Q3 FY26) సంబంధించిన ఫలితాలను కంపెనీ మంగళవారం (జనవరి 27) ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ లాభాల పంట పండించింది.

లాభాల్లో భారీ జంప్

టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లాభాల్లో 38% వృద్ధి.. ఉప్పు, పప్పు, టీ బిజినెస్ భేష్
టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లాభాల్లో 38% వృద్ధి.. ఉప్పు, పప్పు, టీ బిజినెస్ భేష్

గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే, టాటా కన్స్యూమర్ ఏకీకృత నికర లాభం (Consolidated Net Profit) 38% పెరిగింది. గత ఏడాది క్యూ3లో కంపెనీ లాభం రూ. 278.88 కోట్లుగా ఉండగా.. ఈ ఏడాది అది రూ. 384.61 కోట్లకు చేరింది.

ఆదాయం కూడా పైపైకే..

కేవలం లాభాలు మాత్రమే కాదు, కంపెనీ ఆదాయం (Revenue) కూడా రెండంకెల వృద్ధిని నమోదు చేసింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 15.22% పెరిగి రూ. 5,112 కోట్లకు చేరింది. ప్రధానంగా భారతీయ మార్కెట్ (India Business) నుంచి వచ్చిన బలమైన డిమాండ్ ఇందుకు దోహదపడింది. ఇక కంపెనీ నిర్వహణ లాభం (EBITDA) 26% పెరిగి రూ. 728 కోట్లుగా నమోదైంది. మార్జిన్లు కూడా మెరుగుపడి 14.2% వద్ద నిలిచాయి.

ఏ విభాగం ఎలా రాణించిందంటే?

1. ఫుడ్ బిజినెస్: భారతదేశంలో టాటా ఫుడ్స్ బిజినెస్ 19% వృద్ధిని సాధించింది.

టాటా సాల్ట్: ఉప్పు వ్యాపారం వరుసగా నాలుగో త్రైమాసికంలోనూ రెండంకెల వృద్ధిని (14% రెవెన్యూ గ్రోత్) నమోదు చేసింది. అమ్మకాల పరిమాణం (Volume) పెరగడం ఇక్కడ కీలకంగా మారింది.

టాటా సంపన్న్: పప్పులు, సుగంధ ద్రవ్యాల (మసాలాలు) విభాగమైన ‘టాటా సంపన్న్’ (Tata Sampann) ఏకంగా 45% వృద్ధిని సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కొత్తగా మార్కెట్లోకి తెచ్చిన ఉత్పత్తులకు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించిందని కంపెనీ తెలిపింది.

2. బెవరేజెస్ (టీ & కాఫీ):

విదేశీ మార్కెట్లలోనూ టాటా సత్తా చాటింది. అంతర్జాతీయ వ్యాపారం 18% వృద్ధి చెందగా, నాన్-బ్రాండెడ్ విభాగం 23% వృద్ధిని నమోదు చేసింది. మొత్తానికి, ఆర్థిక మందగమన ఛాయలు ఉన్నప్పటికీ, నిత్యావసర వస్తువుల విభాగంలో టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ తన పట్టును నిలుపుకుందనే చెప్పాలి.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe