దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్.. తన పాపులర్ ఎలక్ట్రిక్ కూపే ఎస్‌యూవీ 'కర్వ్ ఈవీ' లైనప్‌ను మరింత విస్తరించింది. భారత్‌లో కొత్తగా సిరీస్ఎక్స్ వేరియంట్లను విడుదల చేసింది. వీటి ప్రారంభ ధర రూ. 16.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. లాంగ్ రేంజ్ బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వచ్చిన ఈ కొత్త వేరియంట్లపై ఒక లుక్కేద్దాం.
టాటా కర్వ్ ఈవీ సిరీస్ఎక్స్ వేరియంట్లు, బ్యాటరీ సామర్థ్యం..

టాటా కర్వ్ ఈవీ కొత్త సిరీస్ఎక్స్ లైనప్‌లో టాటా రెండు ప్రధాన వేరియంట్లను ప్రవేశపెట్టింది:
- అకాంప్లిష్డ్ ఎక్స్ 55
- ఎంపవర్డ్ ఎక్స్ 55
ఈ రెండు వేరియంట్లలోనూ పెద్దదైన 55 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 502 కి.మీ రేంజ్‌ను ఇస్తుంది. అయితే, వాస్తవ పరిస్థితుల్లో ఇది సుమారు 400 కి.మీ వరకు ప్రయాణించగలదని టాటా పేర్కొంది.
టాటా కర్వ్ ఈవీ కొత్త వేరియంట్లు- పవర్, వారంటీ..
టాటా అత్యాధునిక acti.EV ఆర్కిటెక్చర్‌పై ఆధారపడి రూపొందిన ఈ ఎలక్ట్రిక్ కారు, 167 హెచ్‌పీ పవర్, 215 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
మొదటి యజమానికి హై-వోల్టేజ్ బ్యాటరీపై 15 ఏళ్ల లైఫ్ టైమ్ వారంటీని టాటా ఆఫర్ చేస్తోంది. ఇది ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు పెద్ద ఊరటనిచ్చే అంశం.
టాటా కర్వ్ ఈవీ కొత్త వేరియంట్ల వారీగా ఫీచర్లు..
1. అకాంప్లిష్డ్ ఎక్స్ 55
- పనోరమిక్ సన్‌రూఫ్.
- రెండు 10.25-ఇంచుల డిజిటల్ డిస్‌ప్లేలు (ఇన్ఫోటైన్మెంట్ & ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్).
- వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే.
- బ్లైండ్-స్పాట్ మానిటరింగ్‌తో కూడిన 360-డిగ్రీల కెమెరా.
- వెంటిలేటెడ్ సీట్లు, లెథరెట్ అప్‌హోల్స్టరీ.
- రియర్ సన్‌షేడ్స్.
2. ఎంపవర్డ్ ఎక్స్ 55
{{/usCountry}}2. ఎంపవర్డ్ ఎక్స్ 55
{{/usCountry}}అకాంప్లిష్డ్లోని ఫీచర్లతో పాటు ఇందులో అదనంగా:
6-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు.
రిక్లైనింగ్ రియర్ సీట్లు (వెనుక సీట్లను వెనక్కి వాల్చుకోవచ్చు).
పెద్దదైన 12.3-ఇంచుల హర్మాన్ టచ్‌స్క్రీన్.
9-స్పీకర్లతో కూడిన జేబీఎల్ ఆడియో సిస్టమ్ (సబ్‌వూఫర్‌తో).
లెవల్ 2 అడాస్ (20 రకాల సేఫ్టీ ఫంక్షన్లు).
18-ఇంచుల అలాయ్ వీల్స్.
వీ2వీ (వెహికల్ టు వెహికల్), వీ2ఎల్ (వెహికల్ టు లోడ్) ఛార్జింగ్ సదుపాయం.
గెశ్చర్ కంట్రోల్డ్ పవర్డ్ టైల్‌గేట్ (కాళ్లతో సైగ చేస్తే డిక్కీ ఓపెన్ అవుతుంది).
ఇది #DARK ఎడిషన్‌లో కూడా అందుబాటులో ఉంది.
కొత్త రంగు: టాటా ఇందులోకి నైట్రో క్రిమ్సన్ అనే కొత్త ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్‌ను కూడా జోడించింది.
టాటా కర్వ్ ఈవీ కొత్త వేరియంట్ల ఎక్స్‌షోరూం ధరలు..
అకాంప్లిష్డ్ ఎక్స్ 55 -రూ. 16.99 లక్షలు
ఎంపవర్డ్ ఎక్స్ 55 -రూ. 19.19 లక్షలు
ఎంపవర్డ్ ఎక్స్ 55 #DARK - రూ.19.49 లక్షలు