...
...
Next Story

Tata Cars waiting period : టాటా కార్ల డెలివరీ వెయిటింగ్ పీరియడ్- ఏ మోడల్‌కు ఎంత సమయం పడుతోంది?

టాటా మోటార్స్ కార్ల వెయిటింగ్ పీరియడ్స్ వివరాలు అందుబాటులోకి వచ్చాయి. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ కార్లు త్వరగా డెలివరీకి వస్తుండగా కొన్ని ఎలక్ట్రిక్ మోడళ్లకు మాత్రం 24 వారాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది! పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Aug 23, 2026, 14:02:27 IST
Advertisement

టాటా మోటార్స్​ కార్లు కొనాలని లేదా డెలివరీ కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లకు అప్డేట్. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియోలో వివిధ మోడళ్లను బట్టి వెయిటింగ్ పీరియడ్ మారుతూ వస్తోంది. కొన్ని కార్లు కేవలం ఒకటి రెండు వారాల్లోనే డెలివరీ అవుతుండగా, ఎలక్ట్రిక్ వెర్షన్లలో మాత్రం కొన్ని మోడళ్లకు గరిష్టంగా 24 వారాల వరకు వేచి ఉండాల్సి వస్తోంది.

త్వరగా డెలివరీకి లభించే టాటా కార్లు..

టాటా కార్ల వెయిటింగ్ పీరియడ్ వివరాలు..
టాటా కార్ల వెయిటింగ్ పీరియడ్ వివరాలు..

టాటా మోటార్స్​కు సంబంధించి.. టిగోర్, ఆల్ట్రోజ్ కార్లు అత్యంత వేగంగా కస్టమర్ల చేతికి చేరుతున్నాయి. అన్ని పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో ఈ రెండు కార్లకు కేవలం 1 నుంచి 2 వారాల వెయిటింగ్ పీరియడ్ మాత్రమే ఉంది. కర్వ్ ఈవీ కూడా ఇదే జాబితాలో ఉండగా, నెక్సాన్ పెట్రోల్, సీఎన్జీ వెర్షన్లు కూడా ఇదే సమయ వ్యవధిలో అందుబాటులో ఉన్నాయి. కర్వ్ పెట్రోల్ మోడల్ కూడా త్వరగానే డెలివరీకి లభిస్తోంది. అయితే దీని డీజిల్ వెర్షన్ల మాత్రం 2 నుంచి 3 వారాలు వెయిటింగ్ పీరియడ్​ తర్వతో అందుబాటులోకి వస్తోంది.

కాస్త వెయిటింగ్ పీరియడ్ ఉన్న మోడల్స్..

టాటా మోటార్స్‌కు చెందిన కొన్ని ప్యాసింజర్ వెహికల్స్ మోస్తరు డెలివరీ టైమ్‌లైన్‌ను కలిగి ఉన్నాయి. నెక్సాన్ డీజిల్, నెక్సాన్ ఈవీ కార్లకు 3 నుంచి 4 వారాల వెయిటింగ్ పీరియడ్ ఉంది. టియాగో పెట్రోల్, సీఎన్జీ స్మార్ట్ వేరియంట్లకు 10 నుంచి 12 వారాల సమయం పట్టగా, ఇతర ట్రిమ్‌లు 4 నుంచి 6 వారాల్లో లభిస్తాయి. పంచ్ పెట్రోల్, సీఎన్జీ స్మార్ట్ వేరియంట్లకు 10 నుంచి 12 వారాలు కాగా, మిగిలిన వెర్షన్లకు 6 నుంచి 7 వారాల సమయం పడుతోంది. సియెర్రా ఐసీఈ పెట్రోల్ ఎన్ఏ స్మార్ట్ వేరియంట్ 6 నుంచి 8 వారాల్లో డెలివరీ అవుతుండగా, ఇతర పెట్రోల్, డీజిల్ వెర్షన్లు 2 నుంచి 6 వారాల్లో అందుబాటులో ఉన్నాయి.

ఎస్‌యూవీల వెయిటింగ్ వివరాలు..

టాటా ఎలక్ట్రిక్ మోడళ్ల విషయంలోనే అత్యధిక వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది. టియాగో ఈవీ స్మార్ట్ 19, ప్యూర్+ 19 వేరియంట్లకు 18 నుంచి 24 వారాల సమయం పడుతుండగా, ఇతర ట్రిమ్‌లు 4 నుంచి 6 వారాల్లో లభిస్తున్నాయి. పంచ్ ఈవీ స్మార్ట్ 30 కూడా 18 నుంచి 24 వారాల వెయిటింగ్ పీరియడ్‌ను కలిగి ఉంది. స్మార్ట్ 40 వేరియంట్‌కు 10 నుంచి 12 వారాలు, ఇతర వేరియంట్లకు 8 నుంచి 10 వారాలు పడుతుంది. సియెర్రా ఈవీ ప్యూర్ 65 మోడల్ 12 నుంచి 15 వారాల్లో డెలివరీ అవుతోంది.

అంటే.. ఐసీఈ, సీఎన్జీ మోడళ్లతో పోలిస్తే టాటా ఎలక్ట్రిక్ వాహనాలకే ఎక్కువ సమయం పడుతున్నట్లు స్పష్టమవుతోంది. టిగోర్, ఆల్ట్రోజ్, హారియర్, సఫారీ డీజిల్ మోడళ్లు త్వరగా అందుబాటులోకి వస్తుండగా, టియాగో ఈవీ, పంచ్ ఈవీ మోడళ్లు మాత్రం ఎక్కువ ఆలస్యమవుతున్నాయి.

మరి వీటిల్లో మీరు ఏ టాటా కారు కొనుగోలు చేస్తున్నారు?

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks