భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన కస్టమర్లకు పండుగ కానుకలను ప్రకటించింది. ఓనం వేడుకలతో ప్రారంభమైన పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని.. పెట్రోల్, డీజిల్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలపై (ఈవీ) ఆగస్టు నెలలో రూ. 2.25 లక్షల వరకు ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఆఫర్లతో పాటు బుకింగ్‌లపై ప్రయారిటీ డెలివరీలు, ప్రత్యేక ఫైనాన్సింగ్ సదుపాయాలను కల్పిస్తోంది.
టాటా ఆగస్టు 2026 పండుగ ఆఫర్లు..

సాధారణ ఇంజిన్ (ఐసీఈ) కార్లపై గరిష్టంగా రూ. 77,500 వరకు తగ్గింపు లభిస్తోంది. టాటా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్‌పై రూ. 54,500 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీ నెక్సాన్‌పై రూ. 72,500 పండుగ ఆఫర్ లభిస్తోంది. కూపే ఎస్‌యూవీ అయిన టాటా కర్వ్ పై రూ. 77,500 వరకు తగ్గింపు వర్తిస్తుంది. అలాగే హారియర్, సఫారి కార్లపై రూ. 47,000 వరకు పండుగ డిస్కౌంట్ అందిస్తున్నారు.
ఈ ఆఫర్లలో నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాెప్ బోనస్, లాయల్టీ రివార్డులు, కార్పొరేట్ బెనిఫిట్లు వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి.
టాటా ఎలక్ట్రిక్ వాహనాల ఆఫర్లు..
టాటా ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిపై గరిష్టంగా రూ. 2.25 లక్షల వరకు భారీ డిస్కౌంట్ లభిస్తోంది. సబ్-కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ నెక్సాన్ ఈవీపై రూ. 60,000 వరకు తగ్గింపు ఉంది. ఎలక్ట్రిక్ కూపే ఎస్‌యూవీ కర్వ్ ఈవీపై రూ. 55,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. ఇక టాటా హారియర్ ఈవీపై అత్యధికంగా రూ. 2.5 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. హారియర్ ఈవీ ఆఫర్‌లో భాగంగా రూ. 1 లక్ష వరకు లాయల్టీ బెనిఫిట్, ఉచిత ఇన్సూరెన్స్ వంటివి అందిస్తున్నారు.
ఈ ఎలక్ట్రిక్ కార్లపై కూడా క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాప్ బెనిఫిట్, కార్పొరేట్ ప్రయోజనాలు వర్తిస్తాయి.
{{/usCountry}}ఈ ఎలక్ట్రిక్ కార్లపై కూడా క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాప్ బెనిఫిట్, కార్పొరేట్ ప్రయోజనాలు వర్తిస్తాయి.
{{/usCountry}}ప్రాంతాన్ని బట్టి, అందుబాటులో ఉన్న స్టాక్‌ను బట్టి ఈ ఆగస్టు 2026 డిస్కౌంట్ ఆఫర్లలో మార్పులు ఉండవచ్చు అని గుర్తుపెట్టుకోవాలి. పూర్తి వివరాల కోసం మీ సమీపంలోని షోరూమ్‌ను సందర్శించండి.
అంతేకాకుండా టాటా సియెర్రా జూబ్లీ ఎడిషన్, నెక్సాన్ కామో ఎడిషన్, పంచ్ హెచ్‌బీఎక్స్ ఎడిషన్ వంటి కొన్ని ప్రత్యేక ఎడిషన్ ఎస్‌యూవీలను కూడా కంపెనీ ఇటీవల మార్కెట్లోకి తీసుకువచ్చింది.
నెక్సాన్ కామో స్పెషల్ ఎడిషన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
కియా కార్లపై కూడా డిస్కౌంట్లు..
కియా ఇండియా తన కార్ల కొనుగోలుదారులకు గుడ్ వార్త చెప్పింది. ఆగస్టు 2026 నెలలో ఈ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. దాదాపు తన అన్ని మోడళ్లపై ఈ ప్రయోజనాలను అందిస్తోంది. మోడల్, వేరియంట్‌ను బట్టి నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్క్రాప్ ఇన్సెంటివ్‌లు, కార్పొరేట్ బెనిఫిట్లు, లాయల్టీ బోనస్‌లను కస్టమర్లు పొందవచ్చు. కియా కార్నివాల్ కారుపై గరిష్టంగా రూ. లక్ష వరకు తగ్గింపు లభిస్తోంది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.