భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (FY27) మొదటి త్రైమాసికంలో (క్యూ1) అద్భుతమైన అమ్మకాలతో దూసుకుపోయింది. కొత్త మోడళ్ల లాంచ్, ఎలక్ట్రిక్ వాహనాలకు (EV) పెరుగుతున్న డిమాండ్, జూన్ నెలలో నమోదైన రికార్డు విక్రయాల ఊతంతో ప్యాసింజర్ వెహికల్స్ విభాగంలో కంపెనీ 46 శాతం వృద్ధిని సాధించింది. క్యూ1 ఫైనాన్షియల్ ఇయర్ 27 లో మొత్తం 1,82,574 కార్లు, ఎస్‌యూవీలను (SUVs) విక్రయించినట్లు సంస్థ ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో (క్యూ1 ఫైనాన్షియల్ ఇయర్ 26) ఈ అమ్మకాల సంఖ్య 1,24,809 యూనిట్లుగా మాత్రమే ఉంది.
దేశీయ మార్కెట్లోనే భారీ డిమాండ్.. జూన్‌లో రికార్డులు

టాటా మోటార్స్ సాధించిన ఈ భారీ వృద్ధిలో భారతీయ మార్కెట్ కీలక పాత్ర పోషించింది. దేశీయంగా ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 45 శాతం పెరిగాయి. గత ఏడాది క్యూ1 లో 1,23,839 యూనిట్లు అమ్ముడవగా, ఈ ఏడాది అదే సమయానికి దేశీయ విక్రయాలు 1,80,166 యూనిట్లకు చేరాయి.
మరోవైపు, జూన్ నెల కంపెనీకి సరికొత్త రికార్డులను తెచ్చిపెట్టింది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లు రెండింటినీ కలుపుకుని జూన్ నెలలో మొత్తం 63,083 వాహనాలను విక్రయించింది. గత ఏడాది జూన్ (2025) లో జరిగిన 37,237 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ఇది ఏకంగా 69 శాతం ఎక్కువ. అంతర్జాతీయ మార్కెట్లకు చేసే ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి. గత ఏడాది క్యూ1 లో 970 యూనిట్లుగా ఉన్న ఎగుమతులు, ఈ ఏడాది క్యూ1 నాటికి 2,408 యూనిట్లకు చేరుకున్నాయి.
ఈవీ (EV) విభాగంలో దూసుకుపోతున్న టాటా
ఈ త్రైమాసికంలో టాటా మోటార్స్‌కు అత్యధిక లాభాలను తెచ్చిపెట్టింది ఎలక్ట్రిక్ వాహనాల విభాగమే. టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్‌తో సహా కంపెనీ ఈ క్యూ1 లో మొత్తం 34,467 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో అమ్ముడైన 16,231 ఈవీలతో పోలిస్తే ఇది 112 శాతం అద్భుత వృద్ధిని సూచిస్తోంది.
ముఖ్యంగా జూన్ నెల ఈవీ బిజినెస్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఒక్క నెలలోనే ఏకంగా 14,800 ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. గత ఏడాది జూన్ (2025) లో అమ్ముడైన 5,228 ఈవీలతో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.
అన్ని మోడళ్లకు క్రేజ్.. సప్లై సమస్యలపై ఫోకస్
{{/usCountry}}ముఖ్యంగా జూన్ నెల ఈవీ బిజినెస్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఒక్క నెలలోనే ఏకంగా 14,800 ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. గత ఏడాది జూన్ (2025) లో అమ్ముడైన 5,228 ఈవీలతో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.
అన్ని మోడళ్లకు క్రేజ్.. సప్లై సమస్యలపై ఫోకస్
{{/usCountry}}కంపెనీ పోర్ట్‌ఫోలియోలోని అన్ని వాహనాలకు మార్కెట్లో బలమైన డిమాండ్ కనిపిస్తోందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ ఎండీ, సీఈఓ శైలేష్ చంద్ర తెలిపారు.
"ఆర్థిక సంవత్సరం 2026-27 మొదటి త్రైమాసికం టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ విభాగానికి ఎంతో బలంగా ప్రారంభమైంది. పరిశ్రమ అంచనాలను మించి ఏడాది ప్రాతిపదికన (YoY) 46 శాతం వృద్ధితో 1,82,574 కార్లు, ఎస్‌యూవీలను విక్రయించాం" అని ఆయన పేర్కొన్నారు.
అప్‌డేటెడ్ వెర్షన్లలో వచ్చిన టాటా టియాగో (Tiago), పంచ్ (Punch) మోడళ్లకు కస్టమర్ల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్లలో ఈవీలను కొనేందుకు కస్టమర్లు ఆసక్తి చూపుతున్నారన్నారు. అయితే, సప్లై చైన్ (సప్లై పరిమితులు) సమస్యల కారణంగా 'టాటా సియెర్రా' (Sierra) మోడల్ ప్రొడక్షన్ వాల్యూమ్స్ కొంత ప్రభావితమయ్యాయని కంపెనీ స్పష్టం చేసింది. వెండర్ల నుంచి ఉత్పత్తిని పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, క్యూ2 (రెండో త్రైమాసికం) నుంచి డెలివరీలు సాధారణ స్థితికి వస్తాయని టాటా మోటార్స్ ధీమా వ్యక్తం చేసింది.