టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ తమ సరికొత్త సియెర్రా ఎస్‌యూవీని ఇండియాలో లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇక ఇప్పుడు ఈ మోడల్‌కి సంబంధించిన లాంచ్ డేట్ బయటకు వచ్చింది. నవంబర్ 25న టాటా సియెర్రాను విడుదల చేయనున్నట్లు దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ ధృవీకరించింది. ఫలితంగా ఒకప్పుడు డిస్కాంటిన్యూ అయిన ఈ ఎస్యూవీ తిరిగి భారత మార్కెట్‌లోకి సరికొత్తగా ఎంట్రీ ఇవ్వనుంది.
టాటా సియెర్రా ఎస్యూవీ..

తాజా అవతారంలో ఈ టాటా సియెర్రా అత్యాధునిక టెక్నాలజీతో వస్తోంది. ఇది మారుతీ సుజుకీ విక్టోరిస్, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, హ్యుందాయ్ క్రెటా వంటి ఆధునిక పోటీదారులతో గట్టిగా తలపడనుంది.
అధికారిక లాంచ్‌కు ముందు, ఈ ఎస్‌యూవీని నవంబర్ 15న సంస్థ ఆవిష్కరిస్తుంది. ఈ వాహనం టెస్టింగ్ సందర్భంగా అనేకసార్లు కెమెరాలకు చిక్కింది. చివరిసారిగా కనిపించిన టెస్ట్ మోడల్ క్యామోఫ్లేజ్ కవర్‌తో కప్పి ఉంది.
టాటా సియెర్రా- డిజైన్, ఫీచర్లు..
స్పై ఇమేజ్‌ల ప్రకారం.. 2025 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన మోడల్ ఆధారంగా చూస్తే, టాటా సియెర్రా ఐసీఈ వెర్షన్‌లో ఈ కింది ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్ ఉంటాయని అంచనాలు ఉన్నాయి..
ఆల్-ఎల్ఈడీ లైటింగ్ సెటప్: ఇందులో హెడ్‌లైట్లు, ముందు- వెనుక వైపులా ఫుల్-విడ్త్ లైట్‌బార్‌లు ఉంటాయి.
బ్లాక్-అవుట్ డిజైన్: బ్లాక్ రంగులో ఉన్న ఓఆర్వీఎం (అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్), సీ-పిల్లర్‌లు, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా వంటివి కనిపిస్తాయి.
టాటా సియెర్రా- ఇంటీరియర్ ఫీచర్లు..
మునుపటి స్పై షాట్స్ ప్రకారం.. టాటా సియెర్రా ఎస్యూవీ ఐసీఈలో అత్యాధునికమైన మూడు-స్క్రీన్ లేఅవుట్ ఉండే అవకాశం ఉంది:
- డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే.
- ఇన్ఫోటైన్‌మెంట్ కోసం పెద్ద సెంట్రల్ టచ్‌స్క్రీన్.
- ముందు ప్యాసింజర్ కోసం అదనపు స్క్రీన్.
ఈ మూడు డిస్ప్లేలు 12.3 ఇంచ్ పరిమాణంలో ఉండి, ఫ్లోటింగ్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. డ్యూయల్-టోన్ ఫినిషింగ్, సాఫ్ట్-టచ్ సర్ఫేస్, ముందు భాగంలో విస్తరించి ఉన్న యాంబియంట్ లైటింగ్‌తో మొత్తం ఇంటీరియర్ క్లైమేట్ గణనీయంగా మెరుగుపడుతుందని భావిస్తున్నారు.
టాటా సియెర్రా- ఇంజిన్ ఆప్షన్స్..
{{/usCountry}}ఈ మూడు డిస్ప్లేలు 12.3 ఇంచ్ పరిమాణంలో ఉండి, ఫ్లోటింగ్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. డ్యూయల్-టోన్ ఫినిషింగ్, సాఫ్ట్-టచ్ సర్ఫేస్, ముందు భాగంలో విస్తరించి ఉన్న యాంబియంట్ లైటింగ్‌తో మొత్తం ఇంటీరియర్ క్లైమేట్ గణనీయంగా మెరుగుపడుతుందని భావిస్తున్నారు.
టాటా సియెర్రా- ఇంజిన్ ఆప్షన్స్..
{{/usCountry}}టాటా సియెర్రా ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో మూడు ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది:
- 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్: ఈ ఇంజిన్‌ను టాటా హారియర్ నుంచి తీసుకోనున్నారు.
- 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్.
- 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్.
ఈ టాటా సియెర్రా ధరతో పాటు ఇతర వివరాలు లాంచ్ నాటికి అందుబాటులోకి వస్తాయి. అంతేకాదు, ఐసీఈ వర్షెన్ తర్వాత, ఈ సియెర్రా ఎలక్ట్రిక్ వేరియంట్ (ఈవీ) కూడా విడుదల అవుతుందని తెలుస్తోంది.