Tata Sierra vs Kia Seltos : అదరగొడుతున్న బేస్ వేరియంట్లు- సియెర్రా, సెల్టోస్‌లో ఏది బెస్ట్?
Best SUV to buy: టాటా సియెర్రా- కియా సెల్టోస్ బేస్ వేరియంట్ల మధ్య గట్టి పోటీ ఉంది. సియెర్రా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్స్‌తో సేఫ్టీలో ముందుండగా, సెల్టోస్ పెద్ద డిజిటల్ డిస్‌ప్లే, వైర్‌లెస్ కనెక్టివిటీతో ఆకట్టుకుంటోంది. ఈ రెండింటిలో మీ అవసరాలకు ఏది సరిపోతుందో ఇక్కడ చూసేయండి..
Tata Sierra vs Kia Seltos base variants : మధ్యతరహా ఎస్‌యూవీ విభాగంలో టాటా సియెర్రా, కియా సెల్టోస్ మధ్య ఆసక్తికరమైన పోరు సాగుతోంది. ముఖ్యంగా ఈ రెండు కార్ల బేస్ వేరియంట్లు వేర్వేరు వ్యూహాలతో మార్కెట్లోకి వచ్చాయి. టాటా సియెర్రా 'స్మార్ట్+' వేరియంట్ భద్రతకు పెద్దపీట వేయగా, కియా సెల్టోస్ 'హెచ్‌టీఈ' వేరియంట్ టెక్నాలజీ, లార్జ్ స్క్రీన్ ఫీచర్లపై దృష్టి సారించింది. మరి ఈ రెండింటిలో ఏది కొనాలి? ఏది బెస్ట్? ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..

టాటా సియెర్రా వర్సెస్ కియా సెల్టోస్ బేస్ వేరియంట్లు- భద్రతలో ఎవరిది పైచేయి?
సేఫ్టీ విషయంలో టాటా ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. సియెర్రా స్మార్ట్+ వేరియంట్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 20 రకాల ఫంక్షన్లతో కూడిన ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్పీ), ఆల్-వీల్ డిస్క్ బ్రేక్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. అదనంగా హిల్ అసెండ్ కంట్రోల్, పంక్చర్ రిపేర్ కిట్ కూడా లభిస్తాయి.
మరోవైపు, కియా సెల్టోస్ హెచ్టీఈలో ప్రాథమిక భద్రతా ఫీచర్లు ఉన్నప్పటికీ, సియెర్రాతో పోలిస్తే తక్కువగానే కనిపిస్తున్నాయి. ఇందులో స్టాండర్డ్ డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, క్రూయిజ్ కంట్రోల్, కీ-లెస్ ఎంట్రీ, రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. అయితే ఆక్టివ్ సేఫ్టీ ఫీచర్ల జాబితాలో సియెర్రా స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది.
టాటా సియెర్రా వర్సెస్ కియా సెల్టోస్ బేస్ వేరియంట్లు- ఇంటీరియర్, కంఫర్ట్..
క్యాబిన్ లోపల ఈ రెండు ఎస్‌యువీలు భిన్నమైన అనుభూతినిస్తాయి:
టాటా సియెర్రా స్మార్ట్+: ఇందులో డిజిటల్ కాక్‌పిట్, వెనుక వైపు సన్‌షేడ్స్, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్, 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్ రిలీజ్ వంటి ప్రీమియం ఫీచర్ బేస్ వేరియంట్లోనే ఇవ్వడం గమనార్హం.
కియా సెల్టోస్ హెచ్‌టీఈ: టెక్ ప్రియులను అలరించేలా ఇందులో 10.25 ఇంచ్ హెచ్‌డీ టచ్‌స్క్రీన్, 12 ఇంచ్ ఎల్‌సీడీ క్లస్టర్ ఉన్నాయి. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సౌకర్యం కూడా ఉంది. ఆరు స్పీకర్ల ఆడియో సిస్టమ్ దీనికి అదనపు బలం.
టాటా సియెర్రా వర్సెస్ కియా సెల్టోస్ బేస్ వేరియంట్లు- ఎక్స్‌టీరియర్ డిజైన్
బయటి నుంచి చూస్తే, సియెర్రా స్మార్ట్+ వేరియంట్‌లో బై-ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, స్టైలిష్ ఎల్ఈడీ డిఆర్ఎల్స్, డ్యూయల్ టోన్ రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కియా సెల్టోస్ హెచ్టీఈలో 'ఐస్ క్యూబ్' ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, స్టార్ మ్యాప్ ఎల్ఈడీ టైల్ ల్యాంప్స్ ఉన్నప్పటికీ, దీనికి స్టీల్ వీల్స్ మాత్రమే లభిస్తాయి. సియెర్రా లుక్ బేస్ వేరియంట్లోనే కాస్త ఎక్కువ ప్రీమియంగా కనిపిస్తుంది.
టాటా సియెర్రా వర్సెస్ కియా సెల్టోస్ బేస్ వేరియంట్లు- ఇంజన్ సామర్థ్యం..
ఇంజిన్ ఆప్షన్ల విషయంలో రెండు కార్లు దాదాపు సమానంగా ఉన్నాయి:
టాటా సియెర్రా- 1.5లీటర పెట్రోల్ ఇంజన్ 105 హెచ్‌పీ పవర్‌ని, 145 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ 116 హెచ్‌పీ పవర్‌ని, 260 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది.
కియా సెల్టోస్- 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ 113 హెచ్‌పీ పవర్‌ని, 144 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ 114 హెచ్‌పీ పవర్‌ని, 250 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది.
ఈ రెండూ బేస్ వేరియంట్లు కూడా మేన్యువల్ గేర్‌బాక్స్‌తోనే వస్తున్నాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. సేఫ్టీ పరంగా ఏ కారు ఉత్తమం?
ఆన్-పేపర్ డేటా ప్రకారం, టాటా సియెర్రా స్మార్ట్+ మెరుగైన భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్స్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.
2. కియా సెల్టోస్ బేస్ వేరియంట్‌లో టచ్‌స్క్రీన్ ఉందా?
అవును, కియా సెల్టోస్ హెచ్టీఈలో 10.25 ఇంచ్ పెద్ద టచ్‌స్క్రీన్‌తో పాటు వైర్‌లెస్ కనెక్టివిటీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
3. ఏ కారులో డీజిల్ ఇంజన్ ఆప్షన్ ఉంది?
టాటా సియెర్రా, కియా సెల్టోస్.. ఈ రెండు కార్లలోనూ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లు లభిస్తాయి. అయితే టార్క్ విషయంలో సియెర్రా స్వల్పంగా ముందుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


