టాటా గ్రూప్‌నకు చెందిన ప్రముఖ ఉక్కు తయారీ సంస్థ ‘టాటా స్టీల్’ సోమవారం ట్రేడింగ్ సెషన్లో భారీగా పతనమైంది. శుక్రవారం రూ.216.84 వద్ద ముగిసిన ఈ స్టాక్, నేడు రూ.211 వద్ద నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం 10 గంటల ప్రాంతంలో టాటా స్టీల్ షేరు ధర 4.6శాతం నష్టాలతో రూ. 206.72 వద్ద ట్రేడ్ అవుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ మంచి లాభాలను అర్జించినప్పటికీ షేరు ధర ఈ స్థాయిలో పతనం అవుతుండటం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేస్తోంది. అయితే కంపెనీ సాధించిన లాభాలు మార్కెట్ నిపుణులు అంచనా వేసిన దానికంటే స్వల్పంగా తక్కువగా ఉండటమే ఈ ప్రాఫిట్ బుకింగ్‌కు ప్రధాన కారణమని తెలుస్తోంది.
టాటా స్టీల్ క్యూ4 ఫలితాల ముఖ్యాంశాలు..
నికర లాభం : గత ఆర్థిక సంవత్సరం క్యూ4 లో రూ.1,201 కోట్లుగా ఉన్న కన్సాలిడేటెడ్ నికర లాభం.. ఈ ఏడాది మార్చి త్రైమాసికానికి ఏకంగా 147 శాతం వృద్ధితో రూ.2,965 కోట్లకు పెరిగింది. అయితే, మార్కెట్ నిపుణులు దీనిని రూ.3,065 కోట్లుగా అంచనా వేశారు.
ఆదాయం : కంపెనీ మొత్తం ఆదాయం గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే (రూ.56,218 కోట్లు) 13 శాతం పెరిగి రూ.63,270 కోట్లకు చేరుకుంది. ఇది అనలిస్టులు ఊహించిన రూ.62,440 కోట్ల అంచనాను అధిగమించింది.
ఎబిట్డా: కంపెనీ ఎబిటా 47 శాతం వృద్ధితో రూ.9,953 కోట్లుగా నమోదైంది.
డివిడెండ్ ప్రకటన: కంపెనీ బోర్డు డైరెక్టర్లు ఫైనాన్షియల్ ఇయర్ 2026 కోసం రూ.1 ఫేస్ వాల్యూ కలిగిన ప్రతి ఈక్విటీ షేరుపై రూ.4 ఫైనల్ డివిడెండ్‌ను సిఫార్సు చేశారు. జులై 2, 2026న జరిగే ఏజీఎంలో దీనికి ఆమోదం లభించిన తర్వాత, జులై 6, 2026 నుంచి అర్హులైన ఖాతాదారులకు ఈ డివిడెండ్ చెల్లించనున్నారు.
ఈ ఫలితాలపై టాటా స్టీల్ సీఈఓ అండ్ ఎండీ టి.వి.నరేంద్రన్ మాట్లాడుతూ.. "ఆర్థిక సంవత్సరం 2026 ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసు సమస్యలు, టారిఫ్ వివాదాల వల్ల ఉక్కు రంగానికి సవాలుగా మారింది. అయినప్పటికీ మా పటిష్ట వ్యయ నియంత్రణ పద్ధతుల వల్ల గ్లోబల్ బిజినెస్‌లో మంచి పనితీరు కనబరిచాం. ముఖ్యంగా టాటా స్టీల్ ఇండియా చరిత్రలోనే అత్యుత్తమంగా సుమారు 22.5 మిలియన్ టన్నుల డెలివరీలను నమోదు చేసింది," అని పేర్కొన్నారు.
టాటా స్టీల్ షేరు కొనాలా? అమ్మేయాలా? బ్రోకరేజ్ సంస్థల సలహా ఇలా..
టాటా స్టీల్ షేరు ప్రస్తుత పతనంలో ఉన్నప్పటికీ, ప్రముఖ దేశీయ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఈ స్టాక్‌పై బుల్లిష్‌గా ఉంది. టాటా స్టీల్ షేర్లకు ‘బై’ రేటింగ్‌ను పునరుద్ఘాటించడంతో పాటు.. భవిష్యత్తు కోసం రూ.250 టార్గెట్ ప్రైజ్‌ని నిర్ణయించింది.
{{/usCountry}}టాటా స్టీల్ షేరు ప్రస్తుత పతనంలో ఉన్నప్పటికీ, ప్రముఖ దేశీయ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఈ స్టాక్‌పై బుల్లిష్‌గా ఉంది. టాటా స్టీల్ షేర్లకు ‘బై’ రేటింగ్‌ను పునరుద్ఘాటించడంతో పాటు.. భవిష్యత్తు కోసం రూ.250 టార్గెట్ ప్రైజ్‌ని నిర్ణయించింది.
{{/usCountry}}యూరప్ వ్యాపారంలో ఉన్న ఉద్గారాల సవాళ్లు, ధరల అస్థిరత వంటి స్వల్పకాలిక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. టాటా స్టీల్ దీర్ఘకాలిక భవిష్యత్తు చాలా బలంగా ఉందని బ్రోకరేజ్ పేర్కొంది. భారతదేశంలో పెరుగుతున్న డిమాండ్, మెరుగైన ఉక్కు ధరల వాతావరణం కారణంగా రాబోయే ఆర్థిక సంవత్సరాల్లో కంపెనీ మరింత వృద్ధి సాధిస్తుందని, అందువల్ల ప్రస్తుత ధర వద్ద ఈ టాటా స్టాక్ ఇన్వెస్టర్లకు మంచి లాభాలను ఇచ్చే అవకాశం ఉందని మోతీలాల్ ఓస్వాల్ తన నివేదికలో అభిప్రాయపడింది.